Monday, November 25, 2024
Homeనేరాలు-ఘోరాలుSangareddy: అగ్ని ప్రమాదం జరిగిన పరిశ్రమను పరిశీలించిన కలెక్టర్

Sangareddy: అగ్ని ప్రమాదం జరిగిన పరిశ్రమను పరిశీలించిన కలెక్టర్

రియాక్టర్ పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించిన మండలం చందాపూర్ శివారులోని ఎస్ బి ఆర్గానిక్ కెమికల్స్ కర్మాగారాన్ని బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి స్థానిక తహసిల్దార్ ఫరీనా షేక్ తో కలిసి సందర్శించారు.

- Advertisement -

రియాక్టర్ లో ఆయిల్ లీకేజీ కారణంగా ప్రమాదం సంభవించినట్లు అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తెలియనట్లు కలెక్టర్ తెలిపారు. రియాక్టర్ పేలిన సంఘటనలో నలుగురు వ్యక్తులు మృతిచెందగా సుమారు 30 మంది వరకు గాయాల పాలైనట్లు తెలిపారు. వీరికి మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ కేర్ ఆస్పత్రికి పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఆయా ఆసుపత్రిలో యజమాన్యాలతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు చూస్తున్నట్లు తెలిపారు.

క్షతగాత్రులు 17 మందిలో, ఎమ్మెన్నార్ ఆస్పత్రిలో, 9 మంది, జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 7, వెల్ నెస్ ఆసుపత్రి లో ఒకరు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు .వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందేలా జిల్లా వైద్యాధికారులు సిబ్బంది ఎమ్మెన్నార్ ఆస్పత్రి సిబ్బందికి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. అగ్ని ప్రమాద సంఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందినట్లు తెలిపారు.

మృతుల్లో కంపెనీ డైరెక్టర్ రవి శర్మ, మధ్యప్రదేశ్ కు చెందిన సురేష్ పాల్ (50), తమిళనాడుకు చెందిన దయానంద్ (48), ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుబ్రహ్మణ్యం (36) లు ఉన్నట్లు తెలిపారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కంపెనీలో తనిఖీ చేసి ప్రమాద వివరాలపై నివేదిక ఇవ్వాలని ఉన్నట్లు నివేదిక ఆధారంగా కంపెనీ యజమాన్యంపై చర్యలు తెలిపారు.

జిల్లాలోని అన్ని పరిశ్రమలలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని చర్యలు చేపట్టని కర్మా గారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా అగ్నిమాపక శాఖధికారి శ్రీధర్,ఆర్ డి ఓ వసంత కుమారి షేక్ హాసశీనా వున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News