Sunday, October 6, 2024
Homeచిత్ర ప్రభSrikanth : అలాంటి ప్రచారాలు చేసే వారిపై పోలీసులకి ఫిర్యాదు చేస్తా..

Srikanth : అలాంటి ప్రచారాలు చేసే వారిపై పోలీసులకి ఫిర్యాదు చేస్తా..

Srikanth : గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ విడాకులు తీసుకోబోతున్నట్టు పలు వార్తలు వచ్చాయి. శ్రీకాంత తన భార్య ఊహతో విడాకులు తీసుకోబోతున్నట్టు పలు వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ ప్రచురించాయి. పలువురు సన్నిహితులు ఈ వార్తలని ఊహ, శ్రీకాంత్ దాకా తీసుకువెళ్లారు. దీంతో శ్రీకాంత్ ఈ వార్తలపై ఫైర్ అయ్యారు.

- Advertisement -

విడాకుల ప్రచారంపై శ్రీకాంత్ స్పందిస్తూ.. ”కొన్ని వెబ్ సైట్లలో వచ్చిన ఫేక్ న్యూస్ చూసి ఊహ ఆందోళనకు గురైంది. విడాకుల వార్తలను నాకు చూపించింది. విడాకుల ప్రచారంపై బంధువులు, సన్నిహితుల నుంచి ఫోన్లు వస్తుంటే వివరణ ఇచ్చుకోలేకపోతున్నా. ఇలా నాపై అసత్య ప్రచారం చేస్తున్న వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. ఇలా నిరాధారమైన పుకార్లు ప్రచారం చేస్తున్న వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలి” అని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News