చదువుతోపాటు విద్యార్థులు క్రీడా రంగాలలో రాణించాలని క్రీడలతోనే మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవచ్చని శతాబ్ది టౌన్షిప్ మేనేజింగ్ డైరెక్టర్ కాసు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధిలోని లింగరావుపల్లి గ్రామానికి చెందిన మల్లె మొగ్గల చంద్రకళ-అంజయ్యల కుమారుడు మల్లేమొగ్గల చైతన్య కే బి స్కూల్ హైదరాబాదులో 5వ తరగతి చదువుతున్నాడు.ఇటీవల నిర్వహించిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టోర్నీలో మల్లెముగ్గల చైతన్య అత్యద్భుతంగా ఆడడం ద్వారా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా అండర్ 14 విభాగంలో బౌలర్ గా సెలెక్ట్ అయ్యాడు.
ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలో క్రికెట్ టోర్నీలో ఆడడానికి రవాణా ఖర్చులకు కావలసిన సామాగ్రి ఇతర ఖర్చులకి ఆర్థిక ఇబ్బంది ఉండడంతో స్థానిక నాయకుల ద్వారా పిఎసిఎస్ చైర్మన్ కేశవరెడ్డి, లింగరావుపల్లి సర్పంచ్ ఎల్లమ్మ తిరుపతయ్యల, ఎంపీటీసీ జోగు రమేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాల్రెడ్డి నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న శతాబ్ది టౌన్షిప్ మేనేజింగ్ డైరెక్టర్ కాసు శ్రీనివాస్ రెడ్డి తక్షణ సహాయంగా 40 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో లింగరావుపల్లి సర్పంచ్ ఎల్లమ్మ తిరుపతయ్య, తలకొండపల్లి ఎంపీటీసీ అధ్యక్షులు జోగు రమేష్, అంజయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ లీడర్లు జలంధర్ రెడ్డి, అంజి రెడ్డి, సురేందర్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బర్ల రఘుపతి తదితరులు ఉన్నారు.