అన్ని వర్గాల కలలను సాకారం చేసేలా, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా బడ్జెట్- 2023-24 ను రూపొందించారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తూ వ్యవసాయంతో పాటు సంక్షేమానికి కూడా పెద్ద పీట వేసేలా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఉందని తెలిపారు. రైతుల రుణమాఫీ పథకానికి రూ. 6,385 కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రైతుల పక్షనా సీయం కేసీఆర్ కు దన్యవాదాలు తెలిపారు. పేదలపై భారం పడకుండా పిల్లల చదువులు, ఆరోగ్య సంరక్షణ కోసం విద్య, వైద్యానికి నిధుల కేటాయింపులో ప్రాధన్యతనిచ్చిందని వెల్లడించారు. పేదలు ఆత్మ గౌరవంతో జీవించేలా సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి రూ.12వేల కోట్లు కేటాయిండంతో పేదల సొంతింటి కల సంపూర్ణ సాకారం కానుందని వ్యాఖ్యనించారు. దేవాలయాల అభివృద్ధి కోసం దేవాదాయ శాఖకు రూ. 368 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు.