Saturday, April 19, 2025
HomeతెలంగాణRIP Santhi Swarup: శాంతి స్వరూప్ మృతికి రేవంత్ సంతాపం

RIP Santhi Swarup: శాంతి స్వరూప్ మృతికి రేవంత్ సంతాపం

దూరదర్శన్ న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్

తొలి తెలుగు న్యూస్ రీడర్‌ శాంతి స్వరూప్‌ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. తెలుగు వార్తలు చదివిన తొలి తరం న్యూస్‌ రీడర్‌గా శాంతి స్వరూప్‌ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో యశోదా ఆస్పత్రిలో చేరిన శాంతిస్వరూప్ చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1983 నుంచి 2011లో పదవీ విరమణ చేసేంత వరకు ఆయన సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్‌లో పని చేశారు. ఆయన అందించిన సేవలు తెలుగు మీడియా రంగంలో చిరస్మరణీయమని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శాంతి స్వరూప్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News