Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుTurkey: 1,300 దాటిన భూకంప మృతుల సంఖ్య.. ఇంకా వేలల్లో మృతులు ? సాయం అందిస్తున్న...

Turkey: 1,300 దాటిన భూకంప మృతుల సంఖ్య.. ఇంకా వేలల్లో మృతులు ? సాయం అందిస్తున్న భారత్

భూకంప ధాటికి చిగురుటాకులా వణికిపోతున్న టర్కీకి ఆపన్న హస్తం అందించేందుకు భారత్ ముందుకు వచ్చింది. పెద్ద మనసుతో టర్కీ వాసులకు అవసరమైన ఆహారం, మందులు పంపుతూ, సహాయ చర్యలు చేపట్టేందుకు పెద్ద ఎత్తున బృందాలను మనదేశం పంపుతోంది.

- Advertisement -

కాగా ఈ తెల్లవారుజామున సంభవించిన టర్కీ భూకంపంలో మృతుల సంఖ్య ఇప్పటికే 1,300 దాటిపోగా వేలల్లో మృతులున్నట్టు అనుమానిస్తున్నారు. రిక్టర్ స్కేల్ పై 7.8గా భూకంప తీవ్రత నమోదు కాగా.. భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. టర్కీతోపాటు పొరుగునే ఉన్న సిరియా కూడా భారీగా నష్టపోయింది. ఒక్క సిరియాలోనే 386 మందికిపైగా మృతిచెందారు. అంతర్యుద్ధంతో గజగజ వణికిపోతున్న సిరియాకు ఈ భూకంపం మరో చావుదెబ్బగా మారింది.

ఇక టర్కీలోనూ మరణమృదంగం మోగుతోంది. 284 మందికిపై ప్రజలు మరణించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. 2,300 మందికి పైగా టర్కీ వాసులు గాయపడ్డట్టు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే ప్రదేశంగా టర్కీ ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News