మన ఇంటిలో ఏదైనా చెత్త చెదారం కనబడితేనే శుభ్రం చేసుకుంటాము. అనుకున్న పనులు జరగాలని నిష్ఠతో పవిత్రంగా ఉంటూ దేవుని స్మరిస్తూ పూజలు చేస్తుంటాము. అలాంటి పవిత్రతతో దేవుని సన్నిధిలోకి వెళ్లాలంటే కోనేరులో స్నానం చేసి దర్శనం చేసుకుంటాము. దానికి విరుద్ధంగా కోనేరు నిండా కప్పల కళేబరాలతో నిండి ఉంటే దానిని ఎవరుశుభ్రం చేయలో ఆ దేవుడికే తెలుసు.
వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ లో దేవాలయ దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు కనీస సౌకర్యాలు ఏర్పాట్లు చేయట్లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయ కోనేరులో కప్పలు చనిపోయి నీరు కలుషితమై అస్తవ్యస్తంగా డ్రైనేజీ నీళ్ల కంటే అధ్వానంగా ఉన్నాయని భక్తులు వాపోతున్నారు.
కనీసం తాగునీరు కూడా లేవని మాతా సాములకు మూత్రశాలలు కనీస ఏర్పాట్లు లేవని అంజన్న భక్తులు వాపోతున్నారు. పట్టుమని నెల రోజులు కాలేదు జాతర బ్రహ్మోత్సవాలు అయిపోయి బ్రహ్మోత్సవాలలో కూడా ఇదే రీతిలో కోనేరులో కుక్కలు సంచరిస్తూ కనిపించాయని, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాట్లు చేయలేదని త్రాగునీటి సమస్య ఉందని ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జాతర జరిగే సమయంలో టెండర్ల పేరిట భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ వచ్చిన ఆదాయం దేవుడెరుగు అని మండిపడుతున్నారు. ఆలయానికి లక్షలలో ఆదాయం వస్తున్న కనీస వసతులు కూడా ఏర్పాట్లు చేయలేని అధికారులు ఎందుకు అని యువ చైతన్య యూత్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు పట్టించుకోని కోనేరును, వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తారా లేదా అనేది వేచి చూద్దాం.