కిసాన్ కాంగ్రెస్ జగిత్యాల జిల్లా నూతన అధ్యక్షులుగా మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన మాజీ జెడ్పిటిసి సభ్యులు ఎలలా జలపతి రెడ్డి నియమితులయ్యారు. నూతన జిల్లా అధ్యక్షునికి కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సుంకేట అన్వేష్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జలపతి రెడ్డి మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు రాష్ట్ర నాయకులు కృష్ణ రావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని జలపతి రెడ్డి అన్నారు.