గార్ల మండల కేంద్రంలోని పిని రెడ్డి గూడెం గ్రామంలో అంగరంగ వైభవంగా ఎడ్లబండ్ల ప్రభల ఊరేగింపు నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కొండలమ్మ దేవాలయంలో నాలుగు రోజులపాటు జరిగే జాతరలో భాగంగా మొదటి రోజు పిని రెడ్డి గూడెం గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో కొండలమ్మకు పూజలు నిర్వహించి, ఎడ్లతో బండ్లను కట్టి రంగురంగు కాగితాలతో ఎడ్ల బండిని అలంకరించి, ఐదు అడుగుల ప్రభతో కూడిన ఎడ్లబండ్లను అంగరంగ వైభవంగా ఆటపాటలతో మేళ తాళాలతో గ్రామస్తులంతా ఏకమై ఘనంగా ఊరేగింపు నిర్వహిస్తూ, కొండలమ్మ దేవాలయానికి చేరుకొని, ఆలయం చుట్టూరా ఎడ్లబండ్ల ప్రభలతో తిరిగి మొక్కులు చెల్లించారు. దీంతో జాతరకు అంకురార్పణ జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పెంట్యాల శ్రీనివాసరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.