Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan 11th Memantha Sidham: మేమంతా సిద్ధం జన జాతరలో జగన్

Jagan 11th Memantha Sidham: మేమంతా సిద్ధం జన జాతరలో జగన్

11వ రోజు బస్సు యాత్రలో అవ్వా తాతలతో ముచ్చటించిన సీఎం

కురిచేడులో కదం తొక్కిన మహిళలు- మేమంతా సిద్దం అంటూ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కు ఘన స్వాగతం పలికారు. మండే ఎండలను సైతం లెక్కచేయకుండా కురిచేడులో బస్సుయాత్రకు సంఘీబావంగా పోటెత్తిన జన ప్రభంజనం. కురిచేడు ప్రధాన రహదారికి ఇరువైపులా బారులుతీరి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు మహిళలు. బస్సుపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు ముఖ్యమంత్రి. సీఎం వైయస్‌.జగన్‌తో పాటు కురిచేడు ప్రధాన రహదారిలో జన ప్రవాహం కనిపించింది.

- Advertisement -

సీఎం వైయస్.జగన్ 11వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి గ్రామంలో పెన్షనర్లతో ముఖ్యమంత్రి వైయస్.జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్. జగన్ ఏమన్నారంటే..:

ఈరోజు అవ్వాతాతల సమక్షంలో ఇలా మీ అందరి మధ్య, మీ ప్రేమానురాగాలు, ఆప్యాయతల మధ్య మీ బిడ్డగా, మీ మనవడిగా మీ అందరితోపాటు మమేకం కావడం చాలా సంతోషాన్ని ఇస్తోంది.
ఈరోజు నేను ప్రతి అవ్వతోనూ, ప్రతితాతతోనూ.. అందరితో కూడా కొన్ని కొన్ని విషయాలను ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను.

గతంలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకూ పెన్షన్‌ రూ.1౦౦౦ మాత్రమే
ఒకసారి మన ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు పెన్షన్ మనకు ఎంత వస్తుండేది, ఎంత మందికి వస్తుండేది అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే.. ఎన్నికలకు రెండు నెలలు ముందు వరకు అప్పట్లో అవ్వాతాతలకు గానీ, వికలాంగులకు గానీ, వితంతు అక్కచెల్లెమ్మలకుగానీ ఇటువంటి అభాగ్యులకు, ఇటువంటి అన్యాయమైన పరిస్థితిలో ఉన్న వారికి ఇచ్చే పెన్షన్ ఎన్నికలకు రెండు నెలలు ముందు వరకు గతంలో పెన్షన్ రూ.1000. అవునా? కాదా?

బాబు హయాంలో కేవలం 39లక్షల పెన్షన్లు మాత్రమే
ఎన్నికలకు 6 నెలలు ముందు వరకు కూడా అప్పట్లో పెన్షన్ ఎంత మందికి ఇచ్చేవారో తెలుసా?.
కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు. కానీ ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మార్పు ఒక్కసారి చూడమని చెబుతున్నా. అప్పట్లో ప్రభుత్వానికి అయ్యే ఖర్చు నెలకు కేవలం రూ.400 కోట్లు ఖర్చయ్యే ఆరోజుల పరిస్థితి అప్పట్లో ఉంటే ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలని, వీళ్లెవ్వరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదని, వీళ్ల ఆత్మగౌరవం నిలబడాలని, పెన్షన్ల కోసం వీళ్లు ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన పని ఉండకూడదని, పెద్ద పెద్ద క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండకూడదని, లైన్లలో నిలబడి తీరా లైన్లో నిలబడిన తర్వాత, ఎక్కడికెక్కడో ఆఫీసుల చుట్టూ తిరిగిన తర్వాత, ఈరోజు లేదు రేపు రా.. అని మళ్లీ చెప్పే పరిస్థితి రాకూడదని, మొట్ట మొదట సారిగా దేశంలోనే బహుశా ఇటువంటి కార్యక్రమం జరగడం లేదు. మొట్ట మొదటి సారిగా మీ బిడ్డ మీ గురించి ఆలోచన చేశాడు. అవ్వాతాతల గురించి ఆలోచన చేశాడు. వారి ఆత్మగౌరవం గురించి, వారి కష్టం గురించి ఆలోచన చేశాడు.

వాలంటీర్లతో ఒకటో తేదీనే పెన్షన్‌ అందిస్తూ…
అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి అన్న దానికి నిర్వచనం ఇస్తూ ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడం, దానికి అనుసంధానంగా ప్రతి 50 ఇళ్లకు, ప్రతి 60 ఇళ్లకు, ప్రతి 70 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించడం, గ్రామ సచివాలయానికి అనుసంధానం చేసి ఆ గ్రామ వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికీ, ప్రతి అవ్వా, ప్రతి తాత ముఖంలో చిరునవ్వు చూడటానికి ప్రతి ఇంటికీ నెల 1వ తారీఖునే అది సెలవుదినమైనా, ఆదివారమైనా ఇంకొకటైనా ఇంకొకటైనా కూడా ఈ 56 నెలలుగా మన ప్రభుత్వం ప్రతి ఇంటికీ నెల 1వ తారీఖునే వచ్చి తలుపుత ట్టి చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ ప్రతి అవ్వనూ, ప్రతి తాతనూ వాలంటీర్లు ఒక మనవడిగా, మనవరాలిగా పలకరిస్తూ అవ్వాతాతలకు అండగా ఉంటూ పెన్షన్ నేరుగా పెన్షన్ చేతుల్లోనే పెడుతున్న పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరుగుతోంది.

మార్పు అన్నది ఒక్కసారి గమనించమని అడుగుతున్నాను.జరిగిన మార్పు ఇదొక్కటే కాదు. రెండో మార్పు కూడా జరిగింది. మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు రెండు నెలలు ముందు వరకు ఆ అవ్వాతాతలకు ఇస్తున్న పెన్షన్ అప్పట్లో కేవలం రూ.1000 మాత్రమే ఉంటే, అది కూడా కేవలం అరకొరగానే కేవలం 39 లక్షల మందికి మాత్రమే ఇస్తున్న పరిస్థితి ఉంటే, అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకునో, లేకపోతే జన్మభూమి కమిటీలు మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగి తెలుసుకుని వివక్ష చూపుతూ ఇచ్చే పరిస్థితి నుంచి మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అర్హత ఉన్న ఏ ఒక్కరైనా కూడా వాళ్లు చివరకు గత ఎన్నికల్లో మన పార్టీకి ఓటు వేశారా లేదా అన్నది కూడా పక్కన పెట్టి కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, వర్గాలు చూడకుండా చివరకు ఏ పార్టీ మనుషులు అని కూడా చూడకుండా, ప్రతి ఒక్కరినీ కూడా నా అవ్వ, నా తాత అని గుండెల్లో పెట్టుకుని చూసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడుతున్నాను.

ఇవాళ 66.34 లక్షల మందికి పెన్షన్లు
అందుకే గతంలో 39 లక్షలు మాత్రమే ఉన్న పెన్షన్ దారులు ఈరోజు చూస్తే 66.34 లక్షల మందికి ఈరోజు పెన్షన్ అందిస్తున్నాం. అది కూడా ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు రూ.1000 ఇస్తున్న గత ప్రభుత్వం మాదిరిగా కాదు.. ఈరోజు ఏకంగా రూ.3 వేల దాకా పెంచుకుంటూ పోయి కూడా మరి అవ్వాతాతలకు మంచి చేసే కార్యక్రమం జరుగుతోంది. తేడాను ఒక్కసారి గమనించమని అడుగుతున్నాను. ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికీ కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే అవ్వాతాతల గురించి ఏదైనా పట్టించుకోవాలన్నా మనసులో ప్రేమ ఉండాలి. ఆ అవ్వల మీద, ఆ తాతల మీద అభాగ్యుల మీద మనసులో ప్రేమ ఉంటేనే ఇటువంటి కొత్త కొత్త రకమైన ఆలోచనలు, మంచి చేసే ఆలోచనలు బయటకు వస్తాయి.


గత పాలకులను చూశారు. నాకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారిని కూడా చూశారు. ఆయన ఎప్పుడూ అంటుంటాడు. 14 ఏళ్లు నేను ముఖ్యమంత్రిగా చేశాను అంటుంటాడు. నేను మూడు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని కూడా చెబుతుంటాడు ఆయన. కానీ ఏ ఒక్కరోజూ కూడా మీ బిడ్డ మాదిరిగా అవ్వాతాతల గురించి ఒక్క రోజైనా ఆలోచన చేశాడా? అన్నది మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతున్నా. కారణం ఏమిటంటే మనసులో ఉండాలి ప్రేమ. అది చేతల్లో బయటకు వస్తుంది అప్పుడే అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలని తాపత్రయం ఉంటేనే ఆ ప్రేమ అనేది బయటకు వస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News