Thursday, April 10, 2025
HomeతెలంగాణMallapur: కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సత్యం రెడ్డి

Mallapur: కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సత్యం రెడ్డి

రైతుల శ్రేయస్సు కోసం కృషి చేస్తా

తెలంగాణ ప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కో ఆర్డినేటర్ గా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన వాకిటి సత్యం రెడ్డిని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకేట అన్వేష్ రెడ్డి నియమించారు. నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని అన్వేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా వాకిటి సత్యం రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కో ఆర్డినేటర్ పదవి బాధ్యత ఇచ్చిన కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డికి, తన నియమకానికి సహకరించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి , టీపీసీసీ డెలిగేట్ సభ్యులు కల్వకుంట్ల సుజిత్ రావు లకు అభినందనలు తెలిపారు. రాబోయే కాలంలో రైతుల శ్రేయస్సు కోసం కృషిచేస్తానని తెలిపారు. జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్న సత్యం రెడ్డికి రాష్ట్ర కో ఆర్డినేటర్ పదవి రావటం పట్ల ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News