Friday, November 22, 2024
HomeదైవంPeddakadaburu: ఆంజనేయస్వామి రథోత్సవం

Peddakadaburu: ఆంజనేయస్వామి రథోత్సవం

ఘనంగా సాగిన

క్రోధ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని పెద్దకడబూరు గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామి రథోత్సవం అశేష భక్తవాహిణి నడమ కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ధర్మకర్త నరవ రమాకాంతరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి ఆలయ అర్చకులు జలాభిషేకం, ఆకుపూజ, కుంకుమార్చన, బిల్వర్చన, పంచామృతాభిషేకంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి రథాన్ని పుష్పాలంకరణతో సుందరంగా అలంకరించారు. సాయంత్రం ఆలయ ధర్మకర్త నరవ రమాకాంతరెడ్డి ఇంటి నుండి స్వామివారి పూర్ణకుంభాన్ని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా శ్రీ ఆంజనేయస్వామి గుడి వద్దకు తెచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తిని రథంపై ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రథోత్సవం గ్రామ పురవీధుల గుండా రమణీయంగా జరిగింది. శ్రీ ఆంజనేయస్వామి రథోత్సవం ఆదోని రహదారిలోని శ్రీ సీతారాముల దేవాలయం వరకు సాగింది.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నరవ శశిరేఖ, టీడీపీ నేతలు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ నాయకులు కోడిగుడ్ల ఏసేపు, రాష్ట్ర బీసీ సాధికార కమిటీ మెంబర్ మల్లికార్జున, మీ సేవ ఆంజనేయులు, తలారి అంజి, రాము టిఎన్ఎస్ఎఫ్ నాయకులు బొగ్గుల సుధాకర్ బొగ్గుల సందీప్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News