Friday, November 22, 2024
HomeతెలంగాణBirpur: తెలుగుప్రభ కథనానికి స్పందించిన అధికారులు

Birpur: తెలుగుప్రభ కథనానికి స్పందించిన అధికారులు

తెలుగుప్రభకు థాంక్స్ చెబుతున్న భక్తులు

బీర్ పూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అపరిశుభ్రత తెలుగుప్రభ దినపత్రికలో సోమవారం రోజున పచురితమైన నరసింహా నీ కోనేరుకు దిక్కెవరు, ఆదాయం కావలెను కానీ శుభ్రత మాత్రం వద్దు, కోనేరులో కప్పల కళేబరాలు పట్టించుకునే అధికారులే కరవయ్యారూ.. అనే శీర్షికలు ఎట్టకేలకు దేవాలయ అధికారులను కదిలించాయి.

- Advertisement -

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని కోనేరులోని నీరు మొత్తం తీసివేసి శుభ్రంగా క్లీన్ చేశారు. ఈరోజు కోనేరులో నీటిని నింపుతున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు.

తెలుగు ప్రభ కథనానికి స్పందించిన కలెక్టర్ -షేక్ యాస్మిన్ బాషా

కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం రోజున అధికారులు స్వయంగా బీర్ పూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వెళ్లి అక్కడ ఆలయ అధికారులను, పూజారులను కలిసి కోనేటిని పరిశీలించారు. ఇది దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ, తెలుగుప్రభ పేపర్ లో వచ్చిన న్యూస్ పై ఎంక్వయిరీకి వెళ్ళగా వారు చెప్పిన సమాధానం బ్లీచింగ్ వేయడం వల్ల కప్పలు చనిపోయినట్టుగా తెలిపారు. అలాంటప్పుడు తక్షణమే ఈ నీటిని తొలగించి కోనేటిని శుభ్రం చేసిన తర్వాత వేరే నీటితో కోనేరును నింపవలసిందిగా ఆదేశించారు. ప్రస్తుతం ఇప్పుడు నీటిని తొలగిస్తున్నారు. కోనేరును శుభ్రం చేసి కొత్త నీరు నింపడానికి నాలుగు రోజుల సమయం పడుతుందని తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News