Saturday, November 23, 2024
Homeనేరాలు-ఘోరాలుRamagundam: డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జైలే

Ramagundam: డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జైలే

రెండు సార్లు పట్టుబడితే..

డ్రంక్ అండ్ డ్రైవ్ లో రెండు సార్లు పట్టుబడిన వ్యక్తులకు జైలు శిక్ష తప్పదనీ రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్ ఒక్క ప్రకటనలో పేర్కొన్నారు. రామగుండం ట్రాఫిక్ సి.ఐ.ఆధ్వర్యంలో గత కొంతకాలంగా నిర్వహించిన డ్రంక్ &డ్రైవ్ లో పట్టుబడిన మందుబాబులకు రామగుండం ట్రాఫిక్ పోలిస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఐ.మాట్లాడుతు మద్యం సేవించి వాహనాలు నడపడం వలన జరిగే ప్రమాదాల గురించి వారికి వివరించారు.
మద్యం సేవించి వాహనం నడపే వాళ్లు మానవబాంబుతో సమానమనీ అన్నారు. మద్యం సేవించడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా జరుగుతున్నాయనీ, దాని వల్ల కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంటుందని ఆయన హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు, లైసెన్సు రద్దుకు సిఫారసు చేస్తాన్నామని, వాటితో పాటు జరిమానాలతో కాకుండా జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు.
కౌన్సెలింగ్ అనంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 24 మందిని గోదావరిఖని 2nd అడిషనల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఒక్కొక్కరికి 2000 చొప్పున మొత్తం 48,000 రూపాయల జరిమానా విధించారని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News