నంద్యాల పట్టణానికి చెందిన రమేష్, స్వర్ణ దంపతుల కుమారుడు సాయిహావీష్ ఆరవ తరగతి చదువుతున్నాడు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నంద్యాల కోటేష్ ఆర్ట్ అకాడమీలో 14 అంగుళాల పొడవు, 10 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్టు మీద 0.2 ఎమ్ఎమ్ సైజుగల బొట్టు బిళ్లలను తీసుకోని క్రమంగా అతికిస్తూ బి.ఆర్. అంబేద్కర్ చిత్రాన్ని తయారు చేసాడు. ఈ చిత్రానికి 2,960 బొట్టు బిళ్ళలను వాడారు. “ఈ మైక్రో క్రాప్ట్ కళను తయారు చేయడానికి 3 గంటల సమయం పట్టింది. ఈ చిత్రం పలువురిని ఆకట్టు కుంటుంది.
చిన్నవయసులోనే అత్యంత అద్భుతంగా వేసిన చిన్నారిని పలువురు అభినందించారు. పసి ప్రాయంలోనే ప్రతిభ చూపించిన సాయి హావీష్ పై గురువు కోటేష్ ప్రశంస జల్లు కురిపించారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ గతంలో ఈ బాలుడు రాష్ట్ర, జాతీయ, అంత రాతీయ స్థాయిలో ఎన్నో బంగారు పతకాలు, అవార్డ్స్ సాధించారన్నారు. అంబేద్కర్ పొట్రెయిట్ చిత్రాన్ని కూడా బొట్టు బిళ్ళలలో స్పష్టంగా వేసాడు. పోలికలు అచ్చుగుద్దినట్ల చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉందని విద్యార్థి సంతోషంగా వివరించాడు.