సోమవారం 31 మండలాల్లో తీవ్రవడగాల్పులు,139 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
మంగళవారం 33 మండలాల్లో తీవ్రవడగాల్పులు,113 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(31) :-
పార్వతీపురంమన్యం 10, శ్రీకాకుళం 9, విజయనగరం 8, అల్లూరి 2, కాకినాడ 1, తూర్పుగోదావరి గోకవరం మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(139) :-
శ్రీకాకుళం 17 , విజయనగరం 19, పార్వతీపురంమన్యం 3, అల్లూరిసీతారామరాజు 10, విశాఖపట్నం 3,
అనకాపల్లి 18, కాకినాడ 16, కోనసీమ 9, తూర్పుగోదావరి 18, పశ్చిమగోదావరి 3, ఏలూరు 11, కృష్ణా 3, ఎన్టీఆర్ 5, గుంటూరు 2, పల్నాడు 2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
వడగాల్పులు వీచే మండలాల పూర్తి వివరాలు క్రింది లింక్లో
ఆదివారం నంద్యాల జిల్లా గోస్పాడులో 43.4°C, మన్యం జిల్లా నవగాం, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 43.3°C, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస 42.9°C, వైయస్సార్ జిల్లా సింహాద్రిపురం 42.5°C, అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 42.4°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 35 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 67 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.
ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారు చేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.