Sunday, October 6, 2024
HomeతెలంగాణGodavarikhani: ప్రపంచం గర్వించదగ్గ మేధావి అంబేద్కర్

Godavarikhani: ప్రపంచం గర్వించదగ్గ మేధావి అంబేద్కర్

అంబేద్కర్ కు నివాళి

భావితరాలకు అంబేద్కర్ ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. బి.ఆర్.ఎస్ నియోజకవర్గ కార్యాలయంలో, మున్సిపల్ చౌరస్తాలో జరిగిన కార్య్రమంలో ఆయన పాల్గొని అంబేద్కర్ కు ఘనంగా నివాళి అర్పించారు. ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని బి.ఆర్.ఎస్.ఎం.పి. అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. 133 వ జయంతిని పురస్కరించుకొని గోదావరిఖనిలోని మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ మేధావిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గుర్తించబడటం గొప్ప విషయం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమైనదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ ఆలోచనతో పాలను అందించాలని కోరారు. విద్యుత్ సౌకర్యం లేని రోజుల్లోనే బుడ్డి దీపాల కింద చదువుకున్న అంబేద్కర్ ప్రపంచ మేధావిగా ఎదిగారని కొనియాడారు. ఆయన రాసిన గొప్ప రాజ్యాంగం వల్లనే నేడు దేశంలో చట్టాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు. దేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పని చేసిన అంబేద్కర్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో పాటు బి.ఆర్.ఎస్. ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News