వైరా క్యాంపు కార్యాలయంలో వైరా నియోజకవర్గ శాసన సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ సమక్షంలో గుట్ట కింద గుంపు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు ఎస్కె గౌస్ పాషా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటున్న ప్రభుత్వం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ఎంపీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం మైనార్టీ అధ్యక్షుడు గౌస్ పాషా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందిస్తున్న సంక్షేమాలు చూసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు, కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలికినందుకు ఎమ్మెల్యేకి నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల గెలుపుకు కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, సింగరేణి మండల అధ్యక్షుడు తలారి చంద్ర ప్రకాష్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల, ఎస్.కె గౌస్ పాషా, ఎస్సీ సెల్ అధ్యక్షులు మేదరి టోనీ, భీముడు నాయక్, మహిళ నాయకురాలు నాగవేణి తదితరులు పాల్గొన్నారు.