Saturday, April 19, 2025
HomeఆటKhammam: జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్

Khammam: జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్

అల్లె సాయికిరణ్ ఆధ్వర్యంలో..

ఉమ్మడి ఖమ్మం జిల్లా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. రూరల్ మండలం కరుణగిరి కేంద్రీయ విద్యాలయం రోడ్ వైఎస్ఆర్ సీపీ ఆఫీస్ ను ఆనుకొని ఉన్న ఖాళీ మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు అల్లె సాయికిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీపీబీఎల్ ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటును ఖమ్మం నగర అధ్యక్షులు పిసిసి సభ్యులు మహమ్మద్ జావిద్, ఆర్ జీపి ఎస్ రాష్ట్ర ఇంఛార్జి కిరణ్ ముగబసవ్ లు టాస్ వేసి మొదటి మ్యాచ్ను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని, కాసేపు బ్యాటింగ్ చేసి నిర్వాహకులను ఉత్సాహపరిచారు.

- Advertisement -

క్రీడలలో గెలుపు ఓటములు సహజమని, గెలుపును స్ఫూర్తిగా తీసుకుని క్రీడలలో ముందుకు వెళ్లాలన్నారు. యువత విద్యతో పాటు క్రీడలలో కూడా ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ అధ్యక్షులు బోజెడ్ల సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ సింగం అంజయ్య, ఓబీసీ చైర్మన్ బాణాల లక్ష్మణ్, జహీర్, ఆరీఫ్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News