Saturday, October 5, 2024
HomeతెలంగాణTelangana: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంను ఆశ్రయించిన ప్రభుత్వం

Telangana: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంను ఆశ్రయించిన ప్రభుత్వం

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణ హైకోర్టు సిబిఐకి అప్పగించిన నేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. తెలంగాణ హైకోర్టు తీర్పును వ్యతిరేకించిన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం పిటీషన్ ను వెంటనే విచారణకు తీసుకోవాలంటూ సిజెఐ చంద్రచూడ్ ధర్మాసనాన్ని కోరిన సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ దవే..
సిబిఐ విచారణ ప్రారంభిస్తే సాక్ష్యాలన్నీ ధ్వంసమవుతాయని ఆందోళన వెలిబుచ్చారు. దీంతో రేపు ధర్మాసనం దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావాలని దుష్యంత్ దవేను సీజేఐ కోరింది. రేపు ధర్మాసనం దృష్టికి తీసుకొస్తే వచ్చే వారం విచారణకు అనుమతి ఇస్తామన్న సిజెఐ చంద్రచూడ్ స్పష్టంచేశారు. రేపు మెన్షన్ చేయకపోయినా వచ్చే వారం విచారణకు వస్తుందని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News