Saturday, October 5, 2024
HomeతెలంగాణHyd: నెరవేరిన సెర్ప్ ఉద్యోగుల కల..ఫలించిన 23 ఏళ్ల నిరీక్షణ

Hyd: నెరవేరిన సెర్ప్ ఉద్యోగుల కల..ఫలించిన 23 ఏళ్ల నిరీక్షణ

గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేరింది. 23 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించి.. 4వేల మంది ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషం చిగురించింది. 2018లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సెర్ప్ ఉద్యోగులకు జీతాలు పెంచేలా కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుని ఈమేరకు బడ్జెట్లో అదనంగా 58 కోట్ల రూపాయలు కేటాయించారు. సెర్ప్ ఉద్యోగుల సుదీర్ఘకాల డిమాండ్ నెరవేరడం పట్ల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సహకరించిన మంత్రులు హరీష్ రావు తెలంగాణ సెర్ప్ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ గారి చిత్రపటానికి సెర్ప్ ఉద్యోగులు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News