Sabarimala pilgrims : అయ్యప్ప స్వామి భక్తులకు ఊరట కలిగించే వార్త ఇది. స్వాములు ఇకపై ఇరుముడి(నెయ్యి, కొబ్బరికాయ, ఇతర పూజా సామాగ్రి)ని విమాన క్యాబిన్‌లోనే తమ వెంట తీసుకుని వెళ్లవచ్చు. ఇందుకు బ్యూరో ఆపఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) అనుమతి ఇచ్చింది. ఎయిర్ పోర్టులో అన్ని రకాల తనిఖీలు ముగిసిన తరువాత అయ్యప్ప భక్తులు తీసుకువెళ్లే ఇరుముడిని క్యాబిన్‌లోకి అనుమతించాలని అన్ని విమానాశ్రయాల సెక్యూరిటీ సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేసింది. జనవరి 20 వరకు మాత్రమే ఈ వెసులు బాటును కల్పించింది.
నిబంధనల ప్రకారం విమాన క్యాబిన్‌లోకి మండే స్వభావం ఉన్న వస్తువులను అనుమతించరు. అయితే.. భక్తుల నుంచి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న బీసీఏఎస్ ఈ మేరకు అనుమతి ఇచ్చింది. కాగా.. కేరళలోని అయ్యప్ప ఆలయాన్ని దేశ వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు.