Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Emmiganuru: వైసీపీ, టీడీపీలు దొందూ దొందే: సోమూ వీర్రాజు

Emmiganuru: వైసీపీ, టీడీపీలు దొందూ దొందే: సోమూ వీర్రాజు

కుటుంబ పాలనసాగిస్తు అభివృద్ధి నిరోధక పార్టీలైన టీడీపీ, వైసీపీ పార్టీలను సాగనంపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు పేర్కొన్నారు. బీజేపీ బలోపేతం చేయడానికి రాష్ట్ర పర్యటన లో భాగంగా ఎమ్మిగనూరుకు వచ్చిన సోము వీర్రాజు.. స్థానిక బీజేపీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ పార్టీలు రెండు కుటుంబ పాలన సాగిస్తూ.. ఇసుక, మద్యం దందాలతో దోపిడీ చేస్తూ, దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి కూడా కొన్ని ఎకరాల భూమిని ఆక్రమించారని ఆరోపించారు. సంక్షేమం పేరు చెప్పుకొని దోపిడీకి పాల్పడే పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని సోము వీర్రాజు అన్నారు. ఒక్క ఎమ్మిగనూరులో చంద్రబాబు హయాంలో మరుగుదొడ్లు కడతామని చెప్పి 10వేల కోట్లు కాజేశారని విమర్శించారు. బీజేపీతోనే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఉంటారని, కలిసే ఎన్నికల కు పోతామని అన్నారు. మార్చి 10 నుండి మార్చి 30 వరకు మూడు గ్రామాల్లో, రెండు గ్రామాల్లో ఆరు కిలో మీటర్లు, రెండు కిలో మీటర్ల పాదయాత్ర చేస్తామని, ఆయా గ్రామాల్లో స్థానిక నాయకులు రెండు గ్రామాల్లో పాదయాత్ర చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో 9 వేల చోట్ల పాదయాత్ర చేస్తామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై గ్రామాల్లో సమస్యలను చార్జిషీట్ రూపంలో పెడతామని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News