శంఖు పువ్వు మీరు చూసే ఉంటారు కదా. అదేనండీ శివుడి పూజకు అత్యంత ప్రియమైన పువ్వులని శంఖు పూలు కదా. వాటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మన పూజా సామగ్రి అంతా ఔషధ గుణాలున్న పత్ర-పుష్పాలే కదా. అందుకే ఈ శంఖు పూలను ఫ్రెష్ గా ఉన్నా, ఎండినా వాటితో టీ, కషాయం చేసుకుని తాగుతారు. ఇది మంచి డీటాక్స్ కూడా. స్ట్రెస్ రిలీఫ్, నిద్ర కోసం ఈ పూలను ఉపయోగిస్తారు. మీరు ఇంట్లో కూడా వీటిని హ్యాపీగా పెంచుకోవచ్చు.
అయితే ఇప్పుడు నెట్టింట్లో ఈ పూలతో చేసిన బిర్యానీ ఒకటి ట్రెండింగ్ గా మారింది. ఈ పూలు నీలంగా ఉంటాయి కాబట్టి బిర్యానీ కూడా నీలం రంగులో ఉంటుంది. అందుకే దీనికి అవతార్ బిర్యానీ అని పేరు పెట్టేశారు. మరెందుకు ఆలస్యం ఆ ట్రెండింగ్ డిష్, రెసిపీ అన్నీ మీరు కూడా ఈ కింది లింక్ లో చూసి, నచ్చితే ట్రై కూడా చేసేయండి మరి. శంకుపూలను ఇంగ్లీష్ లో బటర్ఫ్లై పీ ఫ్లవర్స్, హిందీలో అపరాజిత పూలు అంటారు.