ఎమ్మిగనూరు నియోజకవర్గ టిడిపి, బిజేపి, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బీవీ జయనాగేశ్వర రెడ్డి (టిడిపి) నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలోని ఇందిరా నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుండి సోమప్ప సర్కిల్ వరకు టిడిపి నాయకులు కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు.
ఎన్నికల నిబంధనల మేరకు నామినేషన్ వేయడానికి వెళ్ళే టిడిపి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి వెంట ఎంపి డాక్టర్ సంజీవ్ కుమార్ తో పాటు మరో ముగ్గురుని లోపలికి పంపారు. తహసీల్దార్ కార్యాలయంలో అర్ఓ చిరంజీవి కు బీవీ జయ నాగేశ్వర రెడ్డి నామినేషన్ పత్రాలను అందజేశారు. బీవీ 2 సెట్లు వేశారు. అలాగే బీవీ జయనాగేశ్వర రెడ్డి భార్య నిత్య రెడ్డికు నామినేషన్ వేశారు. అర్ఓ చిరంజీవి నామినేషన్ పత్రాలు అందజేశారు.
టిడిపి నాయకులు మాచాని డాక్టర్ సోమనాథ్, మిన్నళ్ల, దేవేంద్ర, పార్లపల్లి మల్లికార్జున, అయ్యాలప్ప, నజీర్ అహ్మద్, తోగటితోట నరసింహులు( బిజేపి), సప్పోగు భాస్కర్ (జనసేన) , ముల్లా నజీమ , ఉమాదేవి,హైమవతి , విజిఏ ఉషా లు బీవీ జయనాగేస్వర రెడ్డి,నిత్య రెడ్డి వెంట నామినేషన్ వేయడానికి వెళ్లారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు తురేగల్ నజీర్ అహ్మద్, సుందర్ రాజు,రామదాసు గౌడ్,నాగరాజు గౌడ్,దయాసాగర్, రూపా జగదీష్, గురు రాజారావు దేశాయ్,మాధవ్ రావు దేశాయ్, కొండయ్య చౌదరి,రంగస్వామి గౌడ్,నేసే మల్లికార్జున, కాసీ మ్ వలి,సలాం, కటారి రాజేంద్ర, దామ నరసింహులు, దర్మపురం గోపాల్, రమేష్ నాయుడు, తిరుపతయ్య నాయుడు, మురళి కృష్ణ రెడ్డి పాల్గొన్నారు.