Saturday, November 23, 2024
Homeచిత్ర ప్రభSankarabharanam : 'శంకరాభరణం' సినిమాకి మరో అరుదైన గౌరవం..

Sankarabharanam : ‘శంకరాభరణం’ సినిమాకి మరో అరుదైన గౌరవం..

- Advertisement -

Sankarabharanam : గోవాలో 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో దేశంలోని ఎన్నో గొప్ప సినిమాలని ప్రదర్శిస్తారు. ఎంతోమంది కళాకారులని, సాంకేతిక నిపుణుల్ని అభినందిస్తారు, సత్కరిస్తారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ వేడుకల్లో క్లాసిక్ గా నిలిచిన ఒకప్పటి సినిమాలని డిజిటలైజ్ చేసి Restored Indian Classics విభాగంలో భద్రపరుస్తారు.

ప్రస్తుతం గోవాలో జరిగే 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాలలో గొప్ప చిత్రాలను డిజిటలైజ్‌ చేసి భద్రపరిచే కార్యక్రమంలో బాగంగా ఈ సంవత్సరం Restored Indian Classics విభాగంలో National Film Archives of India వారు మన తెలుగు సినిమా ఆల్ టైం క్లాసిక్ “శంకరాభరణం” సినిమాని ఎంపిక చేశారు. ఈ సినిమాని చిత్రోత్సవాల్లో ప్రత్యేక ప్రదర్శన కూడా వేయనున్నారు. చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరావు కుమారుడు ఏడిద రాజా ఈ ప్రత్యేక ప్రదర్శనకు హాజరవనున్నారు.

పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ఏడిద నాగేశ్వరావు నిర్మాణంలో కళా తపస్వి శ్రీ. కే. విశ్వనాధ్ దర్శకత్వంలో సోమయాజులు, మంజు భార్గవి ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా 1980లో విడుదలయి భారీ విజయం సాధించి, ఎన్నో అవార్డులని దక్కించుకొని తెలుగులో ఆల్ టైం క్లాసిక్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇలాంటి సినిమాని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఇలా గుర్తించడంతో టాలీవుడ్ హర్షం వ్యక్తం చేస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News