Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Rapthadu: రాప్తాడులో పెరిగిన ఇండిపెండెంట్ అభ్యర్థులు

Rapthadu: రాప్తాడులో పెరిగిన ఇండిపెండెంట్ అభ్యర్థులు

వీరి వల్ల ఎవరికి లాభం?

రాప్తాడు నియోజకవర్గం అంటే రాష్ట్రంలోనే ఒక రికార్డ్. గతంలో పెనుగొండ నియోజకవర్గం ఫ్యాక్షన్ కు, కక్షలకు మారుపేరుగా నిలిచిన విషయం తెలిసిందే. పెనుగొండ నియోజకవర్గంలో 1989 నుంచి ఎన్నో ఫ్యాక్షను హత్యలు జరిగాయి. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా కనుముక్కల సానె చెన్నారెడ్డి, కనుముక్కల రమణారెడ్డి, మద్దుల చెరువు నారాయణరెడ్డి, పరిటాల రవీంద్ర ఎమ్మెల్యేలుగా పనిచేశారు.

- Advertisement -

అప్పుడు పెనుగొండ నియోజకవర్గంలో రొద్దం, పెనుగొండ, సోమందపల్లి, రామగిరి, చెన్నై కొత్తపల్లి, కనగానపల్లి మండలాలు పెనుగొండ నియోజకవర్గంలో కలిసి ఉన్నాయి. దీంతో అప్పుడు ఫ్యాక్షన్ హత్యలు, హత్యాయత్నాలు చాలా జరిగాయని పలువురు పలువు సందర్భాల్లో చెబుతూ ఉంటారు. అందులో భాగంగా 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో పెనుకొండ, రాప్తాడు నియోజకవర్గాలు వేరువేరుగా మార్చడం జరిగింది. ఈ నేపథ్యంలో చెన్నై కొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి మండలాలు రాప్తాడు నియోజకవర్గంలోకి చేరాయి. 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున పరిటాల సునీత ఇక్కడి నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోటీలో నిలబడ్డారు. ఈ ఎన్నికల్లో పరిటాల సునీత కేవలం 1750 ఓట్లతో మాత్రమే గెలిచారు.

2019లో వైయస్ఆర్సీపీ తరఫున తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, టిడిపి తరఫున పరిటాల శ్రీరామ్ పోటీలో నిలబడ్డారు. ఈ ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 27 వేల పైచిలుకు ఓటుతో భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే ప్రస్తుతం రాప్తాడు నియోజవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థుల పోటీ సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో కనగానపల్లి మండలం రాంపురం గ్రామానికి చెందిన ప్రొఫెసర్ రాజేష్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నామినేషన్లు కూడా రాప్తాడు తాసిల్దార్ కార్యాలయంలో దాఖలు చేశారు.

అలాగే మరో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కనుముక్కల సానే ఉమారాణి పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. కనుముక్కల సానే ఉమారాణి ప్రెస్ మీట్ పెట్టి తాను రాప్తాడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. 2014 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతం కోసం తాను కృషి చేస్తున్నానని పెనుగొండ, పుట్టపర్తి, రాప్తాడు, అనంతపురం అభ్యర్థుల గెలుపు కోసం 2019లో పనిచేశానని తనకు ఎటువంటి గుర్తింపు లేదని ఆమె ఆవేదన వ్యక్తపరిచారు. ఈనెల 24వ తేదీన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ప్రొఫెసర్ రాజేష్ గత మూడు నెలల నుంచి రాప్తాడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే రాప్తాడు నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని తెలియజేశారు. అలాగే గోనుగుంట్ల సూర్యనారాయణ వర్గీయులు కూడా రాప్తాడు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ మంత్రి పరిటాల సునీతలలో ఇండిపెండెంట్ అభ్యర్థులు భయాందోళనకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News