శ్రీశైల మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
11వ తేది ఉదయం 8.46 గంటలకు యాగశాల ప్రవేశముతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
21వ తేదిన రాత్రి జరిపే పుష్పోత్సవ, శయనోత్సవాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
• 11.02.2023 ధ్వజారోహణ
• 12.02.2023 – భృంగి వాహన సేవ
• 13.02.2023 – హంస వాహన సేవ
• 14.02.2023 మయూర వాహన సేవ
• 15.02.2023 రావణ వాహన సేవ
• 16.02.2023 – పుష్ప పల్లకీ సేవ
• 17.02.2023 – గజ వాహన సేవ
• 18.02.2023 – మహాశివరాత్రి – ప్రభోత్సవం – నంది వాహన సేవ, లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం
• 19.02.2023 – రథోత్సవం, తెప్పోత్సవం
• 20.02.2023 – యోగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, ధ్వజావరోహణ
21.02.2023 – అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం
పట్టువస్త్రాల సమర్పణ
• 11.02.2023 శ్రీ కాళహస్తీశ్వరస్వామివార్ల దేవస్థానం
• 13.02.2023 – శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం
• 14.02.2023 – ఉదయం శ్రీవరసిద్ధివినాయకస్వామివార్ల దేవస్థానం – కాణిపాకం – సాయంకాలం – తిరుమల తిరుపతి దేవస్థానం
• 15,02.2023 – రాష్ట్ర ప్రభుత్వం
భక్తుల కోసం చలువ పందిళ్ళు
• శివదీక్షా శిబిరాలు, గంగా సదన్ వెనుకభాగం, టోల్ గేట్ సమీపంలోని బసవవనం, సిబ్బంది వసతి గృహాల వద్ద బాల గణేశవనం, ఆలయ దక్షిణభాగంలో రుద్రాక్షవనం. మల్లమ్మ కన్నీరు మొదలైన చోట్ల చలువ పందిర్లు వేసి భక్తులు సేదతీరేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
• సాక్షిగణపతి, పార్కింగ్ ప్రదేశాలు, అన్నదాన భవనము, కల్యాణకట్ట, చండీశ్వరసదనం మొదలైన ఆరుబయలు ప్రదేశాలలో కూడా చలువ పందిర్లు వేశారు.
శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనాలు
• దర్శనాలు నాలుగు క్యూలైన్ల ద్వారా దర్శనానికి అనుమతి
1. ఉచిత దర్శనం
2. శీఘ్రదర్శనం (రూ. 200/-లు)
3. అతి శీఘ్రదర్శనం ( రూ.500/-లు) క్యూలైన్లు
• కంకణాలు ధరించి వచ్చిన పాదయాత్ర భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు
• విరాళాల సేకరణ ఎదురుగా ఈ క్యూలైన్ ప్రారంభమవుతుంది.
• బ్రహ్మోత్సవాలలో రద్దీ కారణంగా భక్తులందరికీ కూడా 11.02.2023 నుండి 21.02.2023 వరకు
స్వామివార్ల అలంకార దర్శనం మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు.
• గతంలో వలనే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాల ప్రారంభములో 5 రోజులపాటు అనగా 11.02.2023 నుండి 15.02.2023 వరకు జ్యోతిర్ముడి కలిగివున్న శివదీక్షా భక్తులకు నిర్ధిష్టవేళలోమాత్రమే స్వామివార్ల ఉచిత స్పర్శదర్శనం కల్పిస్తారు.
• ప్రత్యేక క్యూలైన్ ద్వారా శివదీక్షా భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేయబడ్డాయి.. ఆలయ ఉత్తర భాగంలో గల చంద్రవతి కల్యాణ మండపం నుంచి శివదీక్షా భక్తుల క్యూలైన్ ప్రారంభమవుతుంది.
• క్యూకాంప్లెక్స్ నందు 14 కంపార్టుమెంట్లలో ఉచిత దర్శన భక్తులు వేచివుండే అవకాశం.
• 8 కంపార్టుమెంట్లలో శీఘ్రదర్శనం (రూ.200/-లు) క్యూలైన్లో భక్తులు వేచివుండే అవకాశం
• శివదీక్షా భక్తుల సౌకర్యార్ధం చంద్రవతి కల్యాణ మండపంలో 4 కంపార్టుమెంట్లు ఏర్పాటు
• క్యూకాంప్లెక్స్ లో దర్శనాలకు వేచివుండే భక్తులకు నిరంతరం మంచి నీరు, బిస్కెట్లు, సమయాను సారంగా అల్పాహారం
ఆన్లైన్ లో దర్శన టికెట్లు అందుబాటు
బ్రహ్మోత్సవాల సందర్భంగా 11.02.2023 నుండి 21.02.2023 వరకు శీఘ్ర దర్శనం టికెట్లు (రూ. 200/-), అతి శీఘ్రదర్శనం (రూ. 500/-లు) టికెట్లు ఆన్లైన్లో ఉంచారు.
• రోజుకు 5000 శీఘ్ర దర్శనం టికెట్లు, 2,000 అతి శీఘ్రదర్శనం టికెట్లు అన్లైన్లో అందుబాటులో ఉంచారు. ఆన్లైన్ టికెటు పొందిన భక్తులు వేకువ జామున 4గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 11.00 గంటల వరకు దర్శనాలను చేసుకోవచ్చు.
శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ
• పాతాళగంగ మార్గములోని శివదీక్షా శిబిరాలలో భక్తులు ఇరుముడి సమర్పణకు ఏర్పాట్లు
లడ్డు ప్రసాదాలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా మొత్తం 30 లక్షల లడ్డు ప్రసాదాలను అందుబాటులో ఉండే ఏర్పాట్లు
• మొత్తం 15 కౌంటర్ల ద్వారా అడ్డుప్రసాదాలు విక్రయం
• రద్దీని బట్టి వీటికి అదనంగా మరో 5 కౌంటర్లు కూడా అందుబాటులోకి తెస్తారు
• అంటే మొత్తం 20 కౌంటర్లు ఏర్పాటు చేస్తారన్నమాట. వీటిలో ప్రత్యేకంగా 3 కౌంటర్లు మహిళలకు, దివ్యాంగులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
మంచినీటి సదుపాయం
• రోజుకు 30 లక్షల గ్యాలన్ల మంచినీరు సరఫరా కోసం విస్తృతంగా ఏర్పాట్లు
• వీటిలో 20 లక్షల గ్యాలన్ల ఫిల్టర్ వాటర్, 10లక్షల గ్యాలన్ల క్లోరినేటేడ్ వాటర్ సరఫరా చేస్తారు. ఫిల్టర్బైడ్ 5 స్టోరేజ్ రిజర్వాయర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి నిల్వ సామర్థ్యం 54 లక్షల 40 వేల లీటర్లు
• 7 డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్లు అందుబాటులో ఉన్నాయి.
• టూరిస్ట్ బస్టాండ్, అన్నదాన భవనం, శివదీక్షా శిబిరాలు, కొత్తపేట, చంద్రవతి కల్యాణమండపం, ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, గాండ్ల సత్రం వెనుకభాగంలలో ఈ డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్లు ఉన్నాయి.
• వీటి సామర్థ్యం 33 లక్షల 50వేల లీటర్లు
• క్షేత్రములో పలుచోట్ల 20 వాటర్ స్టోరేజ్ ట్యాంకులు
• క్షేత్రపరిధిలో మొత్తం 400 పబ్లిక్ కుళాయిలను అందుబాటులోకి తెచ్చారు
• క్షేత్రపరిధిలో ఆర్ టిసి బస్టాండ్, కల్యాణ కట్ట, పాతాళ గంగ వద్ద షవర్ బాత్ అవకాశం
• క్షేత్రపరిధిలో పలుచోట్ల 15 ఆర్.ఓ వాటర్ మంచినీటి ప్లాంట్లను (శివగంగా జలప్రసాద పథకం) అందుబాటులో ఉంచనున్నారు.
పాదయాత్ర భక్తులకు మంచినీటి సదుపాయం
• వెంకటాపురం, నాగలూటి, పెద్దచెరువు, భీముని కొలను మెట్లమార్గం, కైలాసద్వారం, హటకేశ్వరం, సాక్షి గణపతి మొదలైన చోట్ల మంచినీటి సదుపాయం కల్పిస్తున్నారు.
పార్కింగ్ ప్రదేశాలు
• మొత్తం 29ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు.
జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల, ఆగమ పాఠశాల ఎదురుగా గల ప్రదేశం, యజ్ఞ వాటిక, వాసవీ విహార్ వద్ద కారు పార్కింగ్ ఏర్పాట్లున్నాయి.
• రింగురోడ్డు వద్ద ఏ.పి.ఎస్. ఆర్.టి.సి, తెలంగాణ ఆర్.టి.సి. కర్ణాటక ఆర్.టి.సి బస్సులకు పార్కింగ్ ఏర్పాట్లున్నాయి.
• వీటికి అదనంగా ఔటర్ రింగు వెంబడి సుమారు 3 వేల వాహనాలను కూడా పార్కింగ్ చేసుకోవచ్చు.
• టూరిస్ట్ బస్సులు యాత్రికుల షెడ్ల వద్ద పార్కింగ్ చేయవచ్చు.
వైద్యసేవ
• శివసదనం వెనుక భాగంలో గల దేవస్థానం వైద్యశాల, పాతాళగంగ మార్గానికి ఎడమవైపు గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యసేవలు అందిస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద 30 పడకల తాత్కాలిక వైద్యశాల కూడా ఏర్పాటు చేశారు.
మెడికల్ క్యాంపులు
వైద్యఆరోగ్యశాఖ వారి సహకారంతో మొత్తం 13 చోట్ల మెడికల్ క్యాంపుల ఏర్పాట్లు
• వెంకటాపురం, నాగలూటి, పెద్ద చెరువు, కైలాసద్వారం, హాటకేశ్వరం వద్ద 5 మెడికల్ క్యాంపులు ఉంటాయి.
• క్షేత్ర పరిధిలో టోల్ గేట్, ఆలయమహాద్వారం, శివదీక్షా శిబిరాలు, పాతాళగంగ మెట్ల మార్గం, పాతాళగంగ, మల్లమ్మ కన్నీరు, టూరిస్ట్ బస్టాండ్, ఏ.పి.ఎస్. ఆర్.టి.సి బస్టాండ్ మొదలైన 8 చోట్ల మెడికల్ క్యాంపులు ఏర్పాటు
అన్నప్రసాద వితరణ
దేవస్థాన అన్నదాన భవనం నుంచి భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించవచ్చు
• వీటికి తోడు క్షేత్రములో పలుచోట్ల స్వచ్ఛంద సేవా సంస్థల వారు అన్నదానాలను చేయడం
వీరికి దేవస్థానం పూర్తి సహాయ సహకారాలను అందిస్తుంది.
పాతాళ గంగ
• పాతాళ గంగలో నీటిమట్టం గణనీయంగా తగ్గుతోంది. అందుకే పాతాళగంగ వద్ద జల్లు స్నానాలకు ఏర్పాటు చేశారు.
గంగాభవాని స్నానఘట్టాలు
ఆలయ పుష్కరిణి సమీపంలో గల గంగాభవాని స్నాన ఘట్టాల వద్ద కూడా భక్తులు పుణ్య స్నానాలు చేయవచ్చు.
సామాన్లు భద్రపరిచే గదులు
• పెద్ద సత్రం వద్ద సామాన్లు భద్రపరిచే గదులు ఏర్పాటు
శౌచాలయాలు
• క్షేత్ర పరిధిలో పలుచోట్ల మొత్తం 750 శాశ్వత శౌచాలయాలు అందుబాటులోకి వచ్చాయి.
• వీటిలో 149 స్నానపు గదులు, 36 మూత్రశాలలు, 346 మరుగుదొడ్లు, 8 ఇ – టాయిలెట్లు, 76 మన
టాయిలెట్లు, (నమ్మ టాయిలెట్స్) 135 టాటా టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయి.
• వీటికి అదనంగా క్షేత్రపరిధిలో తాత్కాలికంగా కూడా మరుగుదొడ్లు ఏర్పాటు
సీసీటీవీ నిఘా
• కంట్రోల్ రూములో 18 ఎల్.ఈ.డి టీవీలు అందుబాటులో ఉన్నాయి. 12 పి.టి.జెడ్ కెమెరాలు, 30 డ్రోమ్ కెమెరాలు, 372 బుల్లెట్ కెమెరాలు, 2 ఫుట్పాల్ కెమెరాలు, 3 వెహికల్ నెంబర్ ప్లేట్ డిటెక్టివ్ కెమెరాలు ఏర్పాటు
ఫ్లెక్సీబోర్డులు
ఉత్సవాలలో మొత్తం 1200 పైగా సూచిక బోర్డులు ఏర్పాటు
• మార్గ సూచికబోర్డులు, సమాచార బోర్డులు, మొదలైన బోర్డులు
జ్యోతిర్ముడి సమర్పణ
• శివ మండల దీక్షను,శివ అర్ధ మండల దీక్షను స్వీకరించిన భక్తులు జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీ మల్లికార్జున స్వామి వారికి జ్యోతిర్ముడి సమర్పించడం సంప్రదాయం.
• భక్తుల సౌకర్యార్థం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో 15 రోజులపాటు జ్యోతిర్ముడి సమర్పణకు ఆయా ఏర్పాట్లున్నాయి.
• ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 23 వరకు అనగా బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు రెండు రోజులు బ్రహ్మోత్సవాలు జరిగే 11రోజులు, బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత రెండు రోజుల పాటు జ్యోతిర్ముడి సమర్పణకు ఆయా ఏర్పాట్లు సిద్ధం చేశారు.
స్పర్శ దర్శనం ఎప్పుడు? ఎలా?
నిర్ధారిత రోజులలో మాత్రమే శివ దీక్షా భక్తులకు స్వామివార్ల స్పర్శ దర్శనం ఉంటుంది. భక్తుల రద్దీ అధికంగా ఉంటున్న కారణంగా నిర్ధారిత రోజులలో మాత్రమే శివదీక్షా భక్తులకు స్వామివార్ల ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తారు.
కాగా జ్యోతిర్ముడి కలిగివున్న శివదీక్షా భక్తులకు మాత్రమే స్వామివార్ల స్పర్శదర్శనం కల్పిస్తారు. ఇతరులు సాధారణ భక్తులతో కలిసి స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలి.
• గతంలో వలనే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాల ప్రారంభములో 5 రోజుల పాటు అనగా 11.02.2023 నుండి 15.02.2023 వరకు జ్యోతిర్ముడి కలిగివున్న శివదీక్షా భక్తులకు నిర్దిష్ట వేళలో మాత్రమే స్వామివార్ల ఉచిత స్పర్శ దర్శనం కల్పిస్తారు.