జుట్టు ఊడుతోందా? బరువు కూడా పెరుగుతున్నారా? ఎలా ఈ సమస్యల నుంచి బయటపడాలి అని ఆలోచిస్తున్నారా? దీనికి టు ఇన్ వన్ పరిష్కారం ఉంది. ఆలివ్ లేదా హలీమ్ గింజలు ఈ సమస్యలను ఇట్టే పరిష్కరిస్తాయి. వంటల్లో వాడే ఈ గింజలు పోషకాహార నిధులు. అందువల్లే ఇవి మీ శిరోజాలను ఆరోగ్యంగా ఉంచడమే కాదు మీ బరువును తగ్గించి మిమ్మల్ని స్లిమ్ చేస్తాయి కూడా. హలీమ్ గింజలు మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇదే విషయం పలు స్టడిల్లో కూడా వెల్లడైంది. ఈ గింజల్లో అన్ని ఎసెన్షియల్ పదార్థాలూ ఉన్నాయంటున్నారు పోషకాహారనిపుణులు. ఇవి జుట్టు పెరుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. వీటిల్లో యాంటాక్సిడెంట్లతో పాటు ఎసెన్షియల్ ఫ్యాట్స్ కూడా బాగా ఉన్నాయి. ఇవి వెంట్రుకల నాణ్యతను కాపాడడమే కాదు అవి బాగా పెరిగేలా కూడా సహకరిస్తాయి. ఈ గింజల్లో కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ప్రొటీన్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా శిరోజాలను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. ముందే చెప్పుకున్నట్టు హలీమ్ గింజల్లో ప్రొటీన్లతో పాటు డైటరీ ఫైబర్ కూడా బాగా ఉండడంతో వెయిట్లాస్ బాగా అవుతాం.
వీటిల్లోని ప్రొటీన్ల వల్ల కడుపు నిండుగా ఉండి తొందరగా ఆకలి వేయదు. దాంతో చిరుతిండ్ల మీద ద్రుష్టిపోదు. అతిగా తినం కూడా. హలీమ్ గింజల్లోని అత్యంత ప్రమాణాల్లో ఉన్న డైటరీ ఫైబర్ వల్ల మలబద్దకం తలెత్తదు. అలాగే గ్యాసు, కడుపులో పోట్లు వంటి జీర్ణ సంబంధ సమస్యలు ఎదురవవు. ఈ గింజల్ని మన డైట్ లో రకరకాలుగా చేర్చవచ్చు. ఇవి ఫ్యాట్ రిచ్ మీల్స్ ను మనకు అందిస్తాయి. వారానికి మూడు సార్లు అర చెంచా హలీమ్ సీడ్స్ తీసుకుని వాటిని పాలు, లస్సీ, స్మూదీ వేటిలోనైనా కలుపుకుని తాగొచ్చు.
ఐరన్ ఎక్కువ అందాలంటే ఈ గింజలను నిమ్మ నీళ్లల్లో వేసుకుని అన్నం తినడానికి పదిహేను నిమిషాల మందు తాగాలి. హలీమ్ గిజంల మొలకలను నట్స్, రకరకాల సీడ్స్ తో కలిపి సలాడ్ లో వేసుకుని తింటే కూడా ఎంతో మంచిది. వీటి వల్ల పొందే ప్రయోజనాలన్నింటిని బాగా పొందుతాం. అంతేకాదు ఈ గింజల వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. హలీమ్ గింజల్లో ఈస్ట్రోజన్ పాత్రను పోషించే ఫైటో ఈస్ట్రోజన్ ఉంటుంది. ఇవి స్త్రీలకు బహిష్టులు సమయానికి వచ్చేలా చేయడంలో ఎంతో తోడ్పడతాయి. అందుకే నెలసరి సరిగా రాని వారు ఈ గింజలను డైట్ లో చేరిస్తే మంచిదంటున్నారు పోషకాహారనిపుణులు, వైద్యులు కూడా.
ఈ గింజల్లోని ఫ్లెవనాయిడ్స్, ఫోలిక్ యాసిడ్, విటమన్ సి, విటమిన్ Aలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జ్వరం, జలుబు , గొంతునొప్పి ఇన్ఫక్షన్లు తగ్గించే యాంటిమైక్రోబియల్ గుణాలు సైతం ఈ
గింజల్లో ఉన్నాయి.ఈ గింజల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటితో తయారుచేసిన లడ్డూను రోజుకు ఒకటి తింటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. హలీమ్ గింజల్లో యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటి కార్సినోజెనిక్ గుణాలు కూడా ఉన్నాయి. వీటిల్లోని యాంటాక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ నుంచి శరీర కణాలను కాపాడతాయి.