ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి ఏంటో చెప్పాలని పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బుక్కపట్నం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ బీసీ కాలనీ చైర్ బజారు తదితర ప్రాంతాల్లో పర్యటించి యువత మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలకరించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ముందుగా ఒక పట్నానికి విచ్చేసిన పల్లె సింధూరం ఇక్కడ స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు. మహిళలు హారతులు పట్టి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి మినహా ఈ ఐదేళ్ల వైసిపి పాలనలో చేసిన అభివృద్ధి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొన్నారు. మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా ఎంతో మంది ప్రజలు అనేక కష్టాలు సమస్యలు తనకు చెబుతుంటే ఎంతో అవేదన చెందానని పేర్కొన్నారు. ప్రజలకు నరకం చూపించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీనే మనకు గుర్తొస్తుందన్నారు. ఇలాంటి దుర్మార్గమైన పాలన పోవాలంటే మే 13 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి పుట్టపర్తి నియోజకవర్గం టిడిపి ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి, హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పార్థసారథిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టిడిపి జన సేన, బీజీపీ మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ కాలనీలో పల్లె సింధూర సమక్షంలో 20 కుటుంబాలు టిడిపిలోకి చేరారు. బుక్కపట్నం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో వైసీపీ నుంచి 20 కుటుంబాలు, అదేవిధంగా స్వారాభి విశ్వరూప చారి కుటుంబం టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి సమక్షంలో పార్టీతీర్థం పుచ్చుకున్నారు. పార్టీలకు చెేరిన వారికి ఆమె స్వాగతం పలికి టిడిపి కండువా కప్పి ఆహ్వానించారు.