Friday, November 22, 2024
HomeతెలంగాణKarimnagar: పద్మానగర్ మానేరు స్కూల్లో ఎబివిపి దాడి

Karimnagar: పద్మానగర్ మానేరు స్కూల్లో ఎబివిపి దాడి

అధిక ఫీజులు వసూల్ చేస్తున్నారని ఫర్నిచర్ ధ్వసం

అధిక పీజులు వసూల్, చేయడమే కాకా పీజులు కట్టందే హాస్టల్ విద్యార్థులను పంపించడం లేదని ఎబివిపి కార్యకర్తలు పద్మానగర్ లోని మానేరుస్కూల్ లో ఫర్నిచర్ ధ్వసం చేసారు. ఈరోజు అస్కూల్లో పరీక్షలు ముగియడంతో హాస్టల్ విద్యార్థులను ఇంటికి తీసుక వెళ్లేందుకు పేరెంట్స్ వచ్చారు. అయితే కొందరు పేరెంట్స్ డ్యూ ఉండడంతో పీజు చెల్లించాలని స్కూల్ సిబ్బంది అనడంతో కొందరు విద్యార్థుల తల్లితండ్రులు ఏ బి వి పి నాయకులను సంప్రదించినట్లు తెల్సింది.

- Advertisement -

ఫీజుల విషయంలో స్కూల్ కు వచ్చి వారు సిబ్బందిని సంప్రదిస్తే పీజులు చెల్లించాలని చెప్పగా, స్కూల్ యాజమానితో మాట్లాడుతానని ఆ సార్ ను పిలవండని కార్యకర్తలు కోరగా సార్ ఇక్కడ లేడు అని చెప్పడంతోనే అగ్రహించిన కార్యకర్తలు రెచ్చిపోయి కంప్యూటర్ కు సంబంధించిన వస్తువులను, కుర్చీలను పూలకుండిలను ధ్వసం చేశారిని సిబ్బంది అంటున్నారు. ఆఫీసులో గొడవ అనంతరం స్కూల్ లోపల ఏబివిపీ కార్యకర్తలు డీఈఓ రావాలని బైటయించారు.

ఈ సందర్బంగా ఏబివిపి నాయకులు మాట్లాడుతూ విద్యార్థులను, వారి తల్లితండ్రులను అధిక ఫీజుల పేర పీల్చి, పిండి చేస్తున్నారని, ఫీజులు చెల్లించకుండా హాస్టల్ విద్యార్థులను ఇంటికి పంపించమని చెప్తున్నారని వారు ఆరోపించారు. యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీస్ లు ఏబివిపి నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఫీజుల విషయంలో పట్టువిడుపుగానే ఉన్నామని, ప్రతి ఏటా యూనియన్ ల నాయకులు తమ వద్ద స్కూల్ చందాలు తీసుకుంటున్నారని, అయినా ఇలా కొందరు గొడవలు చేస్తున్నారని (యాజమాన్యం) చైర్మన్ అనంతరెడ్డి పోలీసులకు వివరించారు. విద్యార్ధి నాయకులు సమస్యను సామరస్యంగా పరిష్కరించాలి కానీ ధ్వంసం చేయడం సరియైయింది కాదని పలువురు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News