Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభKrithi Shetty : రీసెంట్‌గా హిట్ కొట్టిన హీరో సరసన బేబమ్మ??

Krithi Shetty : రీసెంట్‌గా హిట్ కొట్టిన హీరో సరసన బేబమ్మ??

- Advertisement -

Krithi Shetty : ఉప్పెన సినిమాతో అందర్నీ మెస్మరైజ్ చేసి వరుసగా హ్యాట్రిక్ హిట్స్ ని అందుకుంది యువ కథానాయిక కృతిశెట్టి. ఆ తర్వాత రెండు సినిమాలు ఫ్లాప్ అయినా వరుస అవకాశాలు వస్తున్నాయి బేబమ్మకి. ప్రస్తుతం కృతిశెట్టి నాగచైతన్య, సూర్య సినిమాలలో నటిస్తుంది. మరో సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు తెలుస్తుంది.

తాజాగా కృతిశెట్టి మరో హీరో సరసన సినిమాకి ఓకే చెప్పినట్టు సమాచారం. హీరో శర్వానంద్ అనేక ఫ్లాపుల తర్వాత ఇటీవలే ఒకే ఒక జీవితం సినిమాతో మంచి క్లాసిక్ విజయాన్ని అందుకున్నాడు. దీంతో ఈ సారి కథలని మరింత జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. భలేమంచి రోజు, శమంతకమణి, హీరో లాంటి సినిమాలని తెరకెక్కించిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ ఒక సినిమాకి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది.

ఇందులో శర్వానంద్ సరసన కృతిశెట్టిని తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే కృతి చేతిలో మరో సినిమా చేరినట్టే. వరుసగా యువ హీరోలతో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోతుంది కృతి. మరి ఈ కాంబినేషన్ ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News