రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంట్ లో వాడివేడి చర్చ జరిగింది. ఈసందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో మోడీని ‘మౌనీ బాబా’గా అభివర్ణించటం విశేషం. అదానీపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ఖర్గే నిలదీశారు. అదానీ విషయంపై ఇంత సుదీర్ఘ మౌనాన్ని ప్రధాని ఎందుకు వీడటం లేదన్నారు. అయితే రాజ్యసభ స్పీకర్ జగ్దీప్ ధన్కర్ మాత్రం ఇలా ఖర్గే వ్యాఖ్యానించటం ఆయన హోదాకు తగదని ఖర్గేకు హితవు పలికారు. అదానీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరపాల్సిందేనంటూ ఖర్గే డిమాండ్ చేశారు.