ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులతో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయని ప్రధాని మోడీ విమర్శనాస్త్రాలు గుమ్మరించారు. 2004-2014 మధ్య కాలం అంతా అన్ని రంగాలు కుభకోణాలమయంగా మారిందని నిప్పులు చెరిగిన మోడీ పదునైన మాటలతో కాంగ్రెస్ జమానాపై ధ్వజమెత్తారు. పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై సమాధానం ఇచ్చిన మోడీ చాలా సీరియస్ అంశాలను రేకెత్తారు.
నిర్మాణాత్మక విమర్శలను కట్టిపెట్టి కేవలం విమర్శించక తప్పని పరిస్థితుల్లో విమర్శలకు దిగుతూ, టీవీల్లో మెరిసిపోతున్నారని విపక్షంపై మోడీ విమర్శలు ఎక్కుపెట్టారు. హార్వర్డ్ యూనివర్సిటీ కాంగ్రెస్ ఉత్థాన-పతనాలపై ఆసక్తికరమైన అధ్యయనం చేసిందని రాహుల్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. విపక్ష పార్టీలకు అధికార పక్షంపై ఉన్న అక్కసంతా ఈ ప్రసంగాల్లో వెళ్లగక్కారన్నారు. డిజిటల్ ఇండియా మనదేశం ఎదగటాన్ని యావత్ ప్రపంచం చూస్తోందన్నారు.