Sunday, October 6, 2024
HomeతెలంగాణHyd: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? కవిత

Hyd: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? కవిత

పది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధాని మనకు అవసరమా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. అదానీ‌ కుంభకోణంతో అనేక మంది చిరుద్యోగులు, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని కవిత ఆరోపించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా ‌సుప్రీం కోర్టు జడ్జితో అదానీ వ్యవహారంపై విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఆమె డిమాండ్ చేశారు. హిడెన్ బర్గ్ నివేదిక విడుదలైన 10 రోజుల్లోనే అదాని ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 2వ స్థానం నుండి 22 వ స్థానానికి పడిపోయారని కవిత పేర్కొన్నారు. అదానీ సంస్థ అనేక ప్రభుత్వరంగ సంస్థ ల నుండి అప్పులు తీసుకోవడంతో పాటు, ఎల్ ఐసీ అదానీ గ్రూప్ లో రూ.80 వేల కోట్లు పెట్టుబడి పెట్టిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఎస్బీఐ నుండి రూ. 27 వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుయ రూ. 5,380 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.7 వేల కోట్లు, ఇలా ఏడు జాతీయ బ్యాంకులు అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయన్నారు. హిడెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ సంస్థల షేర్లు 51% పడిపోగా , ఎల్ ఐసీ రూ.18 వేల కోట్లు నష్టపోయిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ర్టపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై గంటన్నర మాట్లాడిన ప్రధాని మోదీ, ఒక్కసారి కూడా అదానీ విషయం ఎందుకు ప్రస్తావించలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News