కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి సబ్ స్టేషన్ పరిధిలోని ss-13, 15kv ట్రాన్స్ఫార్మర్ కు సంబంధించి లో వోల్టేజీ సమస్య ఉందని పలుమార్లు సంబంధిత లైన్మెన్ దృష్టికి తీసుకెళ్లిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని జిల్లా విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు దుర్గం మనోహర్ తెలిపారు.
లైన్మెన్ ఆరెపల్లి శామయ్య అసిస్టెంట్ లైన్మెన్, రేకుర్తి సబ్ స్టేషన్ సబ్ ఇంజనీర్ ఒక ముఠాగా ఏర్పడి అక్రమ లావాదేవులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
లో వోల్టేజ్ సమస్య గత సంవత్సర కాలంగా ఉందని పలుమార్లు లైన్మెన్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. లైన్మెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ గృహ నిర్మాణాల యజమానులతో కుమ్మక్కై ఇబ్బడి ముబ్బడిగా ఇంటి మీటర్లను మంజూరు చేయడంతో లో వోల్టేజ్ సమస్య ఉత్పన్నమవుతుందన్నారు. అక్రమ మీటర్ల మంజూరుపై క్షేత్రస్థాయిలో విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందన్నారు. లో వోల్టేజ్ సమస్యతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి లైన్మెన్ పై విచారణ చేపట్టాలని, లో వోల్టేజ్ సమస్య తీర్చాలనీ ఉన్నత అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు పేర్కొన్నారు.