టెక్ జెయింట్స్ అంతా ఉద్యోగులను వదిలించుకునే పనుల్లో ఉండగా ఇప్పుడు డిస్నీ కూడా ఈ లిస్టులో చేరింది. స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం డిస్నీకి సబ్ స్క్రైబర్స్ బాగా తగ్గిపోయారన్న సాకుతో ఉద్యోగులను లేపేసే పనిలో పడింది. ఇందులో భాగంగా తొలి విడతగా 7,000 మంది ఉద్యోగులను డిస్నీ సాగనంపేస్తోంది. ఎంటర్టైన్మెంట్ జైంట్ గా డిస్నీకి ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో సబ్ స్క్రైబర్స్, యూజర్స్ ఉన్నారు. గతేడాది అక్టోబర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా డిస్నీకున్న వర్క్ ఫోర్స్ 190,000 మంది. వాల్ట్ డిస్నీ యాజమాన్యంలో ఈ సంస్థ నడుస్తోంది. నష్టాలను పూడ్చుకునే పనుల్లో భాగంగా ఇప్పటికే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అయిన నెట్ ఫ్లిక్స్, డిస్నీలు పాస్ వర్డ్ షేరింగ్ పై బోలెడన్ని ఆంక్షలు విధించేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంపై మరిన్ని కొత్త పాలసీలు రూపొందించటంలో ఓటీటీ సంస్థలున్నాయి.
Lay-offs: డిస్నీలో ఆట మొదలు..7,000 మంది ఉద్యోగులకు గుడ్ బై
సంబంధిత వార్తలు | RELATED ARTICLES