అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో వైసీపీ నాయకుల ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వైసిపి నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే తోపుదుర్తి నయనతా రెడ్డి వైసిపి నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల కరపత్రాలను అందిస్తూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం ఎంపీ అభ్యర్థిని బోయ శాంతమ్మ, రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తోపుదుర్తి నయనతా రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతి ఇంటిలోనూ తమ ఆడబిడ్డలా తోపుదుర్తి నయనతా రెడ్డిని అక్కున చేర్చుకున్నారు. ఆప్యాయంగా మాట్లాడారు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాయన్నారు.
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత రాప్తాడు నియోజకవర్గం పూర్తి ప్రశాంతంగా ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీ చెందిన నాయకులు కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు అనేక సందర్భాల్లో చెప్పారని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈకార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహసారధులు, మండల నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.