Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Puttaparthi: సొంత మండలంలో ఎమ్మెల్యే శ్రీధర్ కు షాక్

Puttaparthi: సొంత మండలంలో ఎమ్మెల్యే శ్రీధర్ కు షాక్

పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో..

పుట్టపర్తి వైసిపి ఎమ్మెల్యే దుద్దేకుంట శ్రీధర్ రెడ్డి మండలంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. నల్లమాడ మండలం దొన్నికోట పంచాయతీలో సుమారు 30 వైసీపీ కుటుంబాలు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టిడిపి కండువా కప్పుకుని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దొన్నికోట పంచాయతీ విచ్చేసిన మాజీ మంత్రికి స్థానిక ప్రజలు పూల వర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. పంచాయతీ ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో పుర వీధులన్నీ పసుపు మాయమయ్యాయి.

- Advertisement -

ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పుట్టపర్తి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం సాగుతోందని వీటికి స్వస్తి పలకాలంటే నియోజకవర్గ టిడిపి ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరారు. నియోజకవర్గంలో చిల్లి గవ్వ కూడా అభివృద్ధి జరగ లేదని ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం పుట్టపర్తి ప్రజల దురదృష్టకరమన్నారు.

భగవాన్ సత్య సాయి బాబా నడయాడిన పుట్టపర్తి ప్రాంతంలో నిజాయితీ పాలన అందించే వారు ఎమ్మెల్యేగా ఉండాలని అందుకు మంచి అభ్యర్థి పల్లె సింధూరని ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో సైకో పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పుట్టపర్తి టిడిపి ఉమ్మడి అభ్యర్థి సింధూర హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పార్థసారథి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News