Thursday, September 19, 2024
HomeతెలంగాణNizam Sugars: నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎన్నటికైనా తెరుచుకునేనా ?

Nizam Sugars: నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎన్నటికైనా తెరుచుకునేనా ?

తెలంగాణ వచ్చాకవంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు. దీంతో కార్మికుల ఉసురు పోసుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం చేష్టలకు 3,600 మంది కార్మికులు రోడ్డుపైన దిక్కుతోచని స్థితిలో కాలం గడుపుతున్నారు. ఆందోల్ నియోజకవర్గంలో వలస బాట పట్టక తప్పని పరిస్థితుల్లో పేదలుండటం సర్కారుకు కనిపించటం లేదా అని ఆందోల్ ప్రజలు నిలదీస్తున్నారు.
సుమారు 80 సంవత్సరాల క్రితం నిజాంలు స్థాపించిన ఈ కర్మాగారం 2002లో మూతపడింది. దీంతో ఈ ఫ్యాక్టరీ ఆవరణాలో చెట్లు మొలిచి.. మిషన్ తుప్పు పట్టి పోయి.. వందల కోట్ల విలువైన భూములు పనికిరాకుండా పోతున్నాయి.
2014లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం.. ఈ చక్కెర కర్మాగారాన్ని స్వాధీనం చేసుకుని పునరుద్ధరిస్తుందని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని మరిచి కార్మిక, కర్షక, రైతులను మోసం చేశారని స్థానిక కార్మికులు నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు చెరుకు రైతులు పంట పెట్టాలా వద్దా, పంట పెడితే ఎలా అమ్ముకోవాలనే దిగులుతో ఉన్నారు. కార్మికుల, రైతుల ఇద్దరి మంచికోరే సర్కారు రంగంలోకి దిగి పరిస్థితిని తక్షణం చక్కదిద్దకపోతే స్థానికులు ఉపాధి కోసం వలసపోక తప్పని గడ్డు పరిస్థితులున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News