నేను సైతం కార్మికులకు అండగా పోరాటం చేస్తానంటూ మేడే వేడుకల్లో జెండాను చేతబూని ఓ బుడతడు కదం తొక్కుతూ, ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. గార్ల మండల కేంద్రానికి చెందిన వీరేందర్ ఉష దంపతుల కుమారుడైన మూడు సంవత్సరాల ట్రియాన్స్ మే డే సందర్భంగా కార్మికులు నిర్వహిస్తున్న ప్రదర్శనలో సిఐటియు యూనియన్ కార్మిక ఎర్రజెండాను పట్టుకొని, నేను సైతం కార్మికుల హక్కులను కాపాడడానికి పోరాటం చేస్తానంటూ, భవిష్యత్తులో కార్మికులకు అండగా ఉంటూ వారి పోరాట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, భవిష్యత్తు కార్మికులకు అందజేసే విధంగా పోరాటంలో పాల్గొంటానంటూ కార్మికులతో కలిసి ర్యాలీలో హుషారుగా తిరుగుతుండటంతో పలువురు కార్మికులను విశేషంగా ఆకట్టుకుంది. కార్మిక జెండాను పట్టుకొని తిరుగుతున్న బాలుడిని చూసి పట్టణ ప్రజలు కార్మికులు ఆశ్చర్యానికి గురయ్యారు.