Saturday, October 5, 2024
HomeతెలంగాణGarla: వాడవాడలా మే డే వేడుకలు

Garla: వాడవాడలా మే డే వేడుకలు

రెపరెపలాడిన ఎర్ర జెండా

అమెరికాలోని చికాగో పట్టణంలో పని గంటలు తగ్గించాలని జరిగిన పోరాటంలో అమరులైన కార్మికుల పోరాట స్ఫూర్తితో దేశంలోని పాలకులు స్వదేశీ విదేశీ బడా కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సిపిఎం సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు కందునూరి శ్రీనివాస్ కట్టెబోయిన శ్రీనివాస్ సక్రు జడ సత్యనారాయణలు అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిపిఎం, సిఐటియు, సిపిఐ, ఏఐటియుసి, న్యూ డెమోక్రసీ, ఐ ఎఫ్ టి యు అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గార్ల మండల కేంద్రంలో భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. స్థానిక మంగపతి భవనం నుండి నెహ్రూ సెంటర్ మీదుగా ప్రారంభమైన కార్మిక ప్రదర్శన కార్మిక సంఘ నేతలతో కలిసి జెండాలు ఆవిష్కరిస్తూ డప్పు చప్పుళ్ల నడుమ మే డే ర్యాలీ గార్ల పట్టణ పురవీధుల గుండా సాగింది. అనంతరం సిపిఎం పార్టీ కార్యాలయంలో ఇమ్మడి గోవింద్ అధ్యక్షతన జరిగిన సభలో కందునూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మిక హక్కుల పరిరక్షణకు ఎర్రజెండా ముందు ఉంటుందని, పెట్టుబడులు దోపిడీదారులు భూస్వామ్య విధానాలను వ్యతిరేకంగా పోరాడుతుందని తెలిపారు.

- Advertisement -

చికాగో నగరం లో పని గంటలు తగ్గించాలని జరిగిన పోరాటంలో ఎందరో అమర వీరులు అసువులు బాసి, ఎందరో పోరాట వీరులకు పోరాట స్ఫూర్తిని నింపారని అన్నారు. పోరాడి సాధించుకున్న హక్కులను కాల రాసే విధంగా నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, కార్మిక విధానాలను ప్రతిఘటించి కార్మిక హక్కులను కాపాడుకోవడం కార్మికుల ముందు ఉన్న తక్షణ కర్తవ్యం అన్నారు. దేశంలో కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులు శ్రమ దోపిడికి గురౌతున్నారని, అనేక మందికి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని, మేడే పోరాట స్పూర్తితో కార్మికులు, కర్షకులు సంఘటితమై కార్మికుల హక్కుల పరిరక్షణకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని రానున్న పార్లమెంట్ ఎన్నికలలో చిత్తుగా ఓడించాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు అనుబంధ సంఘాల నాయకులు వి.పి.వెంకటేశ్వర్లు, బి.ఉపేందర్ రెడ్డి, సిహెచ్ ఎల్లయ్య, ఎ.వీరాస్వామి, ఎ.రామకృష్ణ, ఎస్.కె బాజి, బి.లోకేశ్వరావు, సింగం వెంకటేశ్వర్లు, జె.సత్యం, సిహెచ్. బాబు, కైబాబు, వి.మోహన్, కె.రామకృష్ణ, బి.అప్పిరెడ్డి, వి.కోండయ్య, జి.అశోక్, కె ఎల్లయ్య, నాగేశ్వరరావు, మల్లయ్య, దాస్, దస్తాగిరి, కోటయ్య, సర్వర్, కె.మహేశ్వరావు, పి.రమాదేవి తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News