Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: అప్పర్‌ భద్ర ప్రాజెక్టుపై సుప్రీంలో న్యాయపోరాటం

AP: అప్పర్‌ భద్ర ప్రాజెక్టుపై సుప్రీంలో న్యాయపోరాటం

కృష్ణా జలాల్లో ఏపీ వాటా విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని..చంద్రబాబు హయాంలో ‘అప్పర్ భద్ర’కు అన్ని అనుమతులు వస్తున్నా మాట్లాడలేదని..’కర్నాటక కాటన్ దొర’ చంద్రబాబు అంటూ వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి మండిపడ్డారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు ఆ దిశగా చేతలు చూపి మనల్ని నట్టేట ముంచారని..అప్పర్ భద్ర ప్రాజెక్టుపై సుప్రీంలో న్యాయపోరాటం చేస్తామని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి స్పష్టంచేశారు. అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు 2017లో ఫారెస్ట్‌ క్లియరెన్స్‌ వచ్చింది..విస్తరణకు అనుమతులు పొందింది. చంద్రబాబు ప్రభుత్వం ఆనాడు కనీసం అభ్యంతరం కూడా తెలుపలేదని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు నిరాసక్తత వల్ల కర్ణాటక అనేక ప్రాజెక్టులు పూర్తి చేసుకోగలిగిందని ఈ పాపానికి చంద్రబాబును ఉరితీయాలా..? జైల్లో పెట్టాలా..? అంటూ ఆయన మండిపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News