బాహుబలి తరువాత డార్లింగ్ ప్రభాస్ సూపర్ స్టార్స్ ఇమేజ్ ను దాటిపోయారు. ప్యాన్ ఇండియా స్టార్ గా వల్డ్ మార్కెట్ సంపాదించుకున్న ఈ ఫిల్మీ ఐకన్ ఎందుకో సాహో, రాధే శ్యాం వంటి సినిమాలతో ఆ ఇమేజ్ ను మార్కెట్ సరిగ్గా చేసుకోలేక పోయారనే విమర్శలు తెచ్చుకున్నారు. అయినా ప్రభాస్ కెరీర్ కు, ఇమేజ్ కు వచ్చిన ఢోకా ఏం లేదు.
ప్రస్తుతం 2024, 2025 వరకు ఫుల్ బిజీ షెడ్యూల్స్ తో ప్యాక్ అయి ఉన్న ప్రభాస్ క్యాలెండర్ తో ఆయన వరుస రిలీజ్ లను క్యూ లో పెట్టారు. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది హ్యాపియెస్ట్ న్యూసే. ప్రస్తుతం ఐదు సినిమాల వర్క్ తో బిజీగా ఉన్న ప్రభాస్ పై ఫిలిం మేకర్స్ పెడుతున్నట్టు పెట్టుబడులు 2,000 కోట్ల పైమాటే. మరి వీటి రిటర్న్స్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలియదు కానీ ఇవన్నీ భారీ ప్రాజెక్టులుగా.. ప్యాన్ ఇండియా రేంజ్ లో వస్తున్నవే.
ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్, మారుతితో మరో సినిమా సెట్స్ పై ఉన్నాయి. రామాయణం ఆధారంగా ఆదిపురుష్ 450 కోట్లకంటే ఎక్కువ బడ్జెట్ తో రెడీ అవుతోంది. మరో బిగ్ బడ్జెట్ మూవీగా 250కోట్లతో సలార్ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా వస్తోంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నెక్ట్స్ సినిమా కూడా కావటంతో ఈ సినిమాపై చాలా హైప్ ఉండటం సహజం కూడా.
ప్రాజెక్ట్ కే బడ్జెట్ 400 కోట్లుకాగా ఇది మోస్ట్ ప్రామిసింగ్ సైఫై మూవీగా అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజాలతో రెడీ అవుతోంది. నాగ్ అశ్విన్ తీస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
సందీప్ వంగా డైరెక్షన్ లో వస్తున్న డార్లింగ్ 25వ ప్రతిష్ఠాత్మక సినిమా స్పిరిట్. ఇది ప్రభాస్ ఓన్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ లో తెరకెక్కుతోంది. స్పిరిట్ ఆల్రెడీ టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది. ఈ సినిమాలో నటించేందుకు ప్రభాస్ ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నారని గట్టిగా టాక్ ఉంది. ఇక ఆతరువాతి సినిమా మారుతితో 100 కోట్లు పెట్టి తీస్తున్నారు. ఈ ఐదు సినిమాలు హిట్ అయితే లెజెండరీ సూపర్ స్టార్ గా ప్రభాస్ కొత్త స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేయటం ఖాయం. మార్కెట్లో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా ఉన్న ప్రభాస్ సినిమాలు గ్లోబల్ గా కూడా బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. ఈనేపథ్యంలో ఓవర్ సీస్ బిజినెస్ కూడా ప్రభాస్ సినిమాలకు బాగుంటుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.