Wednesday, April 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: యువత భవిష్యత్తు కోసం జై భారత్ పార్టీని గెలిపించండి

Nandikotkuru: యువత భవిష్యత్తు కోసం జై భారత్ పార్టీని గెలిపించండి

జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి

రాష్ట్రంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు లేక వంచన చేసిన ప్రభుత్వానికి, మరియు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చే పార్టీలకు స్వస్తి చెప్పి యువత భవిష్యత్తు ధ్యేయంగా, రైతన్నల కోసం, వైద్యరంగంలో నూతన మార్పుల కోసం ముందుకెళ్లే జై భారత్ నేషనల్ పార్టీని ఆదరించి జరగబోయే ఎన్నికలలో బ్యాటరీ టార్చ్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి బోరెల్లి వెంకట రాముడు ప్రజలను కోరారు.

- Advertisement -

స్థానిక పటేల్ సెంటర్ నందు జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బోరెల్లి వెంకట రాముడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కోసం, నిరుద్యోగ యువకుల కోసం నూతన విధివిధానాలతో పెనుమార్పులకు జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జెడి లక్ష్మీనారాయణ శ్రీకారం చుట్టామన్నారు. బ్యాటరీ టార్చిపై అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జై భారత్ దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News