Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటుకు కేసీఆర్ సర్కారు ఆదేశాలు

Hyd: నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటుకు కేసీఆర్ సర్కారు ఆదేశాలు

నార్కోటిక్స్ వింగ్ ఏర్పాటు చేసి ఏడాది పూర్తైన సందర్భంగా కీలక భేటీ జరిగింది. సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నార్కోటిక్స్ ఏర్పాటైన ఏడాదిలోనే 104 కేసుల్లో 13మంది విదేశీయులు, 185 మంది దేశీయ డ్రగ్స్ పెడలర్లతో పాటు 10మంది సప్లయర్స్, 1,075మంది వినియోగదారులను అరెస్టు చేశామన్నారు. డ్రగ్స్ కేసులతో సంబంధమున్న ముగ్గురు నైజీరియన్లు, ఇద్దరు ఐవరీ కోస్ట్ దేశస్తులు, ఒక సుడాన్ దేశస్తుడిని వారి దేశానికి తిరిగి పంపించివేసినట్లు వివరించారు. తెలంగాణతో పాటు గోవా, ముంబై ఇతర నగరాల్లో కూడా డ్రగ్ ముఠాలు తగ్గుముఖం పట్టాయని సీవీ ఆనంద్ చెప్పటం విశేషం. రాష్ట్ర స్థాయి నార్కొటిక్స్ బ్యూరో ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిందని ఆనంద్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News