Friday, September 20, 2024
Homeనేషనల్Delhi: పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్, ఆప్ ఎంపీల వాకౌట్

Delhi: పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్, ఆప్ ఎంపీల వాకౌట్

పార్లమెంట్ ఉభయ సభలలో ఆరవ రోజు కూడా అదానీ-హిండెన్ బర్గ్ నివేదిక అంశంపై విపక్షాల ఆందోళన కొనసాగింది. ఈ అంశంపై బీఆర్ఎస్ సహా విపక్షాలు చర్చ కోరుతూ ఉభయ సభలలో వాయిదా తీర్మానం ఇచ్చి, చర్చకు పట్టుబడ్డాయి. అధికార పక్షం తీవ్ర నిర్లక్ష్యం చూపడంతో బీఆర్ఎస్ ఎంపీలు అదానీ – హిండెన్ బర్గ్ అంశంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఉభయ సభల నుంచి వాకౌట్ చేశారు. అదానీల కుంభకోణాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ద్వారా విచారణ జరిపించాలంటూ పెద్ద పెట్టున నినాదాలిస్తూ పార్లమెంట్ ఆవరణలో, మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఆందోళనకు దిగారు. జేపీసీ ద్వారా విచారణ జరపాలని, మోడీ- అదానీలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఇతర ఎంపీలతో కలిసి పాల్గొన్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేతలు కే. కేశవరావు, నామా నాగేశ్వరరావులు మీడియాతో మాట్లాడుతూ అదానీ-హిండెన్ బర్గ్ నివేదిక అంశంపై సమగ్ర చర్చ జరగాలంటూ ప్రతిపక్షాలన్నీ కలిసి ఉభయసభలలో వాయిదా తీర్మానాలు ఇస్తుంటే ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నదని విమర్శించారు. జేపీసీ వేసేదాకా తమ ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News