ప్రజలు ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని గార్ల బయ్యారం సీఐ రవికుమార్ ఎస్సై జీనత్ కుమార్ లు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ఆదేశాల మేరకు గార్ల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నుండి పట్టణ పురవీధుల గుండా దాదాపు 60 మంది ట్రైనీ రిక్రూట్ కానిస్టేబుల్స్ తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పట్టణ పురవీధులలో ట్రైనీ పోలీస్ సిబ్బందితో రూట్ మార్చ్ కవాత్ నిర్వహించామన్నారు. యువత ప్రజలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులకు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజల స్వేచ్ఛకు భంగం కలగకుండా మీకు అందుబాటులో పోలీస్ సిబ్బంది ఉంటుందని తెలిపారు.
ఈ కవాతులో సిఐ రవికుమార్ ఎస్ఐ జీనత్ కుమార్ లతోపాటు గార్ల బయ్యారం ఏఎస్ఐ లు రవీందర్ మౌలానా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.