జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన వోటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. ఓటు వేసేందుకు ఎపిక్ కార్డు లేదని ఆందోళన వద్దని సృజన అన్నారు. సాధారణ సార్వత్రిక ఎన్నికలు 2024 లో భాగంగా పోలింగ్ రోజు ఎపిక్ కార్డు లేదని ఓటర్లు ఎవరూ ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ తెలిపారు. క్రింద పేర్కొన్న 13 రకాల గుర్తింపు పత్రాలు ఏవైనా చూపించి నిర్భయంగా ఓటేయవచ్చని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
13 రకాల గుర్తింపు పత్రాల వివరాలు…
1ఓటరు గుర్తింపు కార్డు
2 ఆధార్ కార్డు,
3 జాబ్ కార్డు,
4 బ్యాంక్ పాస్ పుస్తకం,
5 హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్,
6 డ్రైవింగ్ లైసెన్స్,
7 పాన్ కార్డు,
8 కార్మిక శాఖ వారి స్మార్ట్ కార్డు
9 పాస్పోర్ట్,
10 ఫోటో కలిగిన పెన్షన్ డాక్యుమెంట్,
11 సర్వీస్ ఐడి కార్డు,
12 అధికారిక గుర్తింపు కార్డు,
13 యూనిక్ డిసిబిలిటీ ఐడి
పై తెలిపిన ఐడీలలో ఏదైనా ఒకటి చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన తెలియజేశారు.
ఓటర్ సమాచారం స్లిప్పులు మరియు e-EPIC పోలింగ్ స్టేషన్ లో గుర్తింపు ప్రూఫ్ గా ఉపయోగించకూడదు. పోలింగ్ బూత్ లోనికి సెల్ ఫోన్స్ గాని ఎలక్ట్రానిక్ పరికరాలను కానీ అనుమతించబడవని కలెక్టర్ తెలియజేశారు.