Friday, September 20, 2024
HomeదైవంPalakurthi: శ్రీ సోమేశ్వర ఆలయంలో ఆరుద్రోత్సవం

Palakurthi: శ్రీ సోమేశ్వర ఆలయంలో ఆరుద్రోత్సవం

ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని..

శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని ”ఆరుద్రోత్సవం” కార్యక్రమం మేళతాళాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల  మధ్య మహా వైభవోపేతంగా జరిగింది. ఈ సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు ఏకాదశ రుద్రాభిషేకం ఆవు పాలు 108 లీటర్ల తో అభిషేకం, ఆవు నెయ్యి తో గర్భాలయ దీపోత్సవం, పుష్పాలంకరణ, విశేష నీరాజనములు, మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణ. వైభవంగా నిర్వహించారు. ఈ ఆరుద్రోత్సవం కార్యక్రమం భక్తులు పాల్గొని కనులారా తిలకించి తరించారు. శ్రీరామదాసు భజన మండలి ఆధ్వర్యంలో భజన బృందాలు నిర్వహించిన భజనలు అలరించాయి.

- Advertisement -


ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న, సూపర్ డెంట్ వెంకటయ్య, ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న శర్మ, దేవగిరి రమేష్ శర్మ మత్తగాజం నాగరాజు శర్మ, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News